ఒకే ఒక్క వీడియో! మొత్తం మినీ వ్యాన్ మార్కెట్‌కే చెక్‌ పెట్టిన ఇ-రిక్షా డ్రైవర్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వింత వీడియో..!!!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ మనల్ని ఆశ్చర్యపరిచే అనేక రకాల వీడియోలు వైరల్ కావడం సర్వసాధారణం. ఆ కోవలోనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక వీడియో దావానంలా వ్యాపిస్తోంది.

సాధారణంగా గొర్రెలు, మేకలు, ఆవులు లేదా గేదెలు వంటి పశువులను ఒక చోటు నుండి మరోచోటికి రవాణా చేయడానికి పెద్ద లారీలను లేదా టాటా ఏస్ వంటి మినీ వ్యాన్‌లను ఉపయోగిస్తుంటారు. కానీ, ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా.. ఒక భారీ గేదెను తన చిన్న ఈ-రిక్షా (ఎలక్ట్రిక్ ఆటో) వెనుక భాగంలో ఎక్కించుకుని, ఎంతో కూల్‌గా రోడ్డుపై వెళ్తున్నాడు.

నెట్టింట నవ్వుల పువ్వులు – వైరల్ వీడియో:

ఈ విచిత్రమైన దృశ్యాన్ని ఇ-రిక్షా వెనుక మోటార్ సైకిల్‌పై వస్తున్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి, ‘X’ (ట్విట్టర్) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని ఆపుకోలేక రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలో కొందరు దీనిని “మన ఊరి అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్” అని అభివర్ణిస్తుండగా.. మరికొందరు “ఈ ఇ-రిక్షా దెబ్బకు పాపం మినీ వ్యాన్ డ్రైవర్ల కెరీర్ ప్రమాదంలో పడింది, వాళ్ల మార్కెట్ క్లోజ్” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తూ ఈ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: