“ఒక్కగానొక్క కొడుకు..! పూజగదిలో దారుణంగా బలిచ్చిన తండ్రి.. తెల్లవార్లూ శవంతోనే పడుకున్న కిరాతకం. చివరి పూజారి తానేనంటూ షాకింగ్ వాంగ్మూలం. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి.!!!”

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ జిల్లా వింఛియా (Vinchhiya) గ్రామంలో, మానసిక స్థితి సరిగా లేని ఓ తండ్రి తన 10 ఏళ్ల కుమారుడిని ఇంటి పూజగదిలోనే దారుణంగా హత్య చేసి, ఆ మృతదేహం పక్కనే నిద్రించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

వ్యవసాయ కూలీ అయిన నరేశ్ పటేల్, అతని భార్య భారతీబెన్ మధ్య జరిగిన గొడవ కారణంగా ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో, ఆదివారం రాత్రి నరేశ్ పటేల్ తన ఏకైక కుమారుడు కరణ్ (10)తో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో, తాను పూజించే దేవుడి పీఠంపై బాలుడి తలను 2 నుంచి 3 సార్లు అత్యంత కిరాతకంగా బాది, ఆపై కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు.

ఆ తర్వాత, రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని ఒక మంచంపై పడుకోబెట్టి, దాని పక్కనే తానూ వెళ్లి నిద్రపోయాడు. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారంతో పరుగెత్తుకు వచ్చిన తల్లి భారతీబెన్, రక్తపు మరకలతో పడి ఉన్న కొడుకు మృతదేహాన్ని, పక్కనే ఉన్న భర్తను చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది.

ఈ విషయంపై నరేశ్ పటేల్ తన భార్యతో మాట్లాడుతూ.. “తన తండ్రి తర్వాత కుటుంబంలో తానే వారసత్వ పూజారిగా మారానని, భవిష్యత్తులో తమ కుటుంబంలో మరెవరూ పూజారి కాకూడదనే ఉద్దేశంతోనే ఒక్కగానొక్క కొడుకును బలిచ్చానని” చెప్పినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో (FIR) పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సానంద్ (Sanand) పోలీసులు, మానసిక స్థితి సరిగా లేని నరేశ్ పటేల్‌ను అరెస్టు చేసి ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *