ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల అశ్లీల (చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న 29 ఏళ్ల పూజా మాథుర్ అనే మహిళను లక్నో సైబర్ సెల్ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
నిందితురాలు ‘సెల్లర్ హబ్ 01’ అనే పేరుతో టెలిగ్రామ్ యాప్‌లో ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసి, అందులో భారతీయ మరియు విదేశీ మైనర్ల అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేస్తూ అమ్మకాలు సాగించేది. ఒక్కో వీడియో క్లిప్‌కు ₹100 నుండి ₹500 వరకు వసూలు చేసేది.
భర్తతో విడిపోయి తల్లి వద్దే నివసిస్తున్న పూజ, తన మొబైల్ ఫోన్‌కు ఎప్పుడూ పాస్‌వర్డ్ పెట్టి లాక్ చేసేది. ఇంట్లోని వారు ఎవరూ తన ఫోన్‌ను ముట్టుకోవడానికి అస్సలు ఒప్పుకునేది కాదని, దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే తీవ్రంగా గొడవపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
పోలీసుల విచారణలో పూజా మాథుర్ తన నేరాన్ని అంగీకరించడంతో, ఆమెపై పోక్సో (POCSO) మరియు సమాచార సాంకేతిక (IT) చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారం గురించి తెలిసిన పూజ తల్లిదండ్రులు, సోదరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ప్రస్తుతం పూజ మొబైల్ డేటా, బ్యాంక్ ఖాతాలు మరియు ఆమె వద్ద నుండి వీడియోలు కొనుగోలు చేసిన అనుమానిత కస్టమర్ల వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరిస్తున్నారు. ఈ దందాలో పూజ ఒక్కతే భాగస్వామ్యా లేక దీని వెనుక ఏదైనా పెద్ద అంతర్జాతీయ నెట్‌వర్క్ పనిచేస్తోందా అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply