“ఒక్క సినిమా టికెట్ నా మొత్తం కుటుంబాన్ని ఇలా నాశనం చేస్తుందనుకోలేదు!” – మామ, కోడలి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసిన థియేటర్ టికెట్..!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో, మామ కోడలి మధ్య చాలా కాలంగా రహస్యంగా సాగుతున్న అసహ్యకరమైన అక్రమ సంబంధం వ్యవహారం.. కేవలం ఒక్క సినిమా టికెట్ ద్వారా బట్టబయలై ఆ ప్రాంతం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కన్నతండ్రిని, ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను గుడ్డిగా నమ్మిన ఆ యువకుడికి.. వీరిద్దరూ కలిసి తనకు ఇంత పెద్ద ద్రోహం చేస్తున్నారన్న నిజం తెలియగానే కాళ్ల కింద నేల కుంగిపోయినంత పనైంది.

భర్త పని నిమిత్తం బయటకు వెళ్లే సమయాన్ని ఆసరాగా చేసుకుని, మామ కోడలు ఇంటి పరువు తీసేలా ప్రవర్తిస్తూ వచ్చారు. ఒక దశలో వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లి థియేటర్‌లో సినిమా చూసి వచ్చారు. ఆ సమయంలో పొరపాటున భార్య బ్యాగ్‌‌లో మిగిలిపోయిన ఆ సినిమా టికెట్, అనూహ్యంగా భర్త కంటపడింది.

అనుమానం వచ్చి ఆ టికెట్‌పై ఉన్న తేదీ, సమయం ఆధారంగా గట్టిగా నిలదీసి విచారించగా.. తాను ఇంట్లో లేని సమయంలో తన తండ్రి, భార్య కలిసి సినిమాకు వెళ్లారని, వారి మధ్య చాలా కాలంగా అక్రమ సంబంధం ఉందన్న షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.

తన కళ్ల ముందే జరిగిన ఈ అన్యాయాన్ని భరించలేని ఆ కుమారుడు, కన్నతండ్రి అని కూడా చూడకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి ఇద్దరిపైనా ఫిర్యాదు చేశాడు. “నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసిన వీరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆ యువకుడు పోలీస్ స్టేషన్‌లో కన్నీరుమున్నీరుగా విలపించాడు.

ఈ నేపథ్యంలో కుమారుడి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని ఈ దారుణమైన అక్రమ సంబంధం వ్యవహారంపై తీవ్ర దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags: