‘భేల్ పూరీ’ (Bhelpuri) విక్రయించే ఒక వ్యాపారి, విదేశీ పర్యాటకుడి వద్ద అడిగిన అన్యాయమైన ధర ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
సాధారణంగా ఒక ప్లేట్ భేల్ పూరీ ధర కేవలం ₹30 నుండి ₹50 వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఆ పర్యాటకుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆ వ్యాపారి, ఏకంగా ₹500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
కానీ, ఆ పర్యాటకుడు అప్రమత్తంగా వ్యవహరించి, తన మొబైల్లోని ‘చాట్ జీపీటీ’ (ChatGPT) యాప్లో ఆ ఆహారం యొక్క సగటు ధరను తనిఖీ చేశాడు. “భారతదేశంలో భేల్ పూరీ ధర ఎంత?” అని అడిగిన మరుక్షణమే, అది అసలు ధరను చూపించి ఆ వ్యాపారి అసలు రంగును బయటపెట్టింది. దొరికిపోయిన తర్వాత కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా, తీసుకున్న అదనపు డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆ వ్యాపారి, కెమెరా వైపు చూస్తూ వెటకారంగా నవ్వడం నెటిజన్లకు మరింత ఆగ్రహం తెప్పించింది.
“ఇలాంటి మోసాలు చేస్తే ఇక పర్యాటకులు ఇండియాకు ఎలా వస్తారు?” అని నెటిజన్లు ఆ వ్యాపారిని కడిగిపారేస్తున్నారు. మోసగాళ్లను పట్టుకోవడానికి ప్రస్తుత సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ!
