చైనా: చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న కోక్టోకాయ్ (Koktokay) నగరానికి ఒక పర్యాటకురాలు తన స్నేహితులతో కలిసి ‘స్కీయింగ్’ (Skiing) క్రీడ కోసం వెళ్లారు. అక్కడ పర్వత మార్గంలో అరుదైన మంచు చిరుత (Snow Leopard) కనిపించడంతో ఆమె ఉత్సాహం ఆపుకోలేకపోయింది.
ఏం జరిగింది?
సాధారణంగా ఇటువంటి వన్యప్రాణులు కనిపించినప్పుడు కార్లలో ఉండే ఫోటోలు తీసుకోవాలి. కానీ ఆ మహిళ అతి ఉత్సాహంతో కారు దిగి, మంచు చిరుతకు అతి సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించింది. తమ ఆవాసాల్లోకి మనుషులు రావడాన్ని ఇష్టపడని ఆ మంచు చిరుత, మెరుపు వేగంతో ఆమెపై దాడి చేసింది.
వైరల్ అవుతున్న వీడియోలో, చిరుత దాడి చేసిన తర్వాత ఆ మహిళ మంచు గడ్డలపై స్పృహ తప్పి పడి ఉంది. ఆమె పక్కనే ఆ చిరుత కూర్చుని ఉండటం చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటుకు గురికావాల్సిందే.\
అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది:
ఆమె స్నేహితులు ధైర్యంగా వ్యవహరించి చిరుతను అక్కడి నుండి పంపించి, ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, “వన్యప్రాణులు ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు కనీస జ్ఞానం (Civic Sense) ఉండక్కర్లేదా?” అని, “కేవలం ఫోటో కోసం ప్రాణాలను పణంగా పెడతారా?” అని ఆ మహిళపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
