ఒక బాస్ ఇలా చేయొచ్చా..? మహిళల టాయిలెట్‌లో రహస్య కెమెరా.. ఉద్యోగినుల ప్రైవేట్ వీడియోలు తీయడానికి ప్రయత్నించిన కామంధుడి అరెస్ట్!!

కేరళ: తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ ప్రెస్‌లో, మహిళా ఉద్యోగినుల ప్రైవేట్ దృశ్యాలను రికార్డ్ చేయడానికి ప్రయత్నించిన రాహుల్ అశోక్ (38) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

సదరు ప్రెస్‌లో యజమానిగా ఉన్న రాహుల్, మహిళా ఉద్యోగినులు వినియోగించే మరుగుదొడ్డిలో రహస్య కెమెరాను అమర్చి, వారి వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే, మార్చి 13, 2026న మరుగుదొడ్డికి వెళ్ళిన మహిళా ఉద్యోగినులకు అక్కడ ఏదో అనుమానాస్పదంగా కనిపించడంతో, క్షుణ్ణంగా పరిశీలించి రహస్య కెమెరాను గుర్తించారు. దీంతో వారు షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనపై బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నిందితుడు రాహుల్ అశోక్, పోలీసుల నుండి తప్పించుకోవడానికి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. చివరికి, అతను దాక్కున్న రహస్య స్థావరాన్ని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగినుల్లో తీవ్ర భయాందోళనలను, ఆగ్రహాన్ని కలిగించింది.


Posted

in

by

Tags: