ఒక వ్యక్తి ఇంకా ఎన్ని ఏళ్లు జీవిస్తారో తెలుసుకోవాలంటే.. ఇది చేస్తే చాలు!

ఒక వ్యక్తి ఆరోగ్య స్థితి మరియు ఆయుష్షును అంచనా వేయడానికి ఒక చిన్న పరీక్ష సరిపోతుంది. అదేమిటంటే.. వారిని నేలపై కూర్చుని, మళ్లీ పైకి లేవమని చెప్పండి.

నేలపై కూర్చుని, ఎటువంటి ఆధారం లేకుండా (చేతులు లేదా కాళ్లు నేలకు ఆన్చకుండా) నేరుగా లేవగలిగితే వారికి ఆయుష్షు నూరేళ్లు! అలా కాకుండా, చేతులు నేలకు ఆనించి, లేదా ఎవరో ఒకరి సాయం తీసుకుంటేనే లేవగలిగే పరిస్థితి ఉంటే.. వారి ఆరోగ్యం ప్రమాదంలో ఉందని అర్థం.

పరిశోధన ఏం చెబుతోంది? జెరంటాలజీ (ముసలితనంపై అధ్యయనం చేసే శాస్త్రం) విభాగం వారు వృద్ధులతో ఒక ప్రయోగం చేశారు. నేలపై కూర్చుని లేచేటప్పుడు చేతులు లేదా మోకాళ్లు నేలకు ఆనిస్తే పాయింట్లు ఇస్తారు. చేతులు ఆనించి లేచే కొద్దీ మరణించే అవకాశం (Death Risk) ప్రతి పాయింట్‌కు 21% పెరుగుతుందని వారు గమనించారు.

సౌకర్యవంతమైన కూర్చునే పద్ధతి (సుఖాసనం): నేలపై పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవడం అనేది భారత్, చైనా, జపాన్ వంటి దేశాల్లో ఒక సంప్రదాయం. పూర్వం ఇళ్లలో చెప్పులు విడిచి లోపలికి రావడానికి కారణం, మనం నేలపై కూర్చుంటాం కాబట్టే. కానీ నేడు నేలపై కూర్చోవడం అవమానంగా భావిస్తూ వేల రూపాయలు పెట్టి సోఫాలు, కుర్చీలు కొంటున్నాం. దీనివల్ల వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులను కూడా కొని తెచ్చుకుంటున్నాం.

సోఫాల్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెనుక భాగాన ఉండే కండరాలకు పని ఉండదు, దీనివల్ల కండరాలు బలహీనపడి నొప్పులు మొదలవుతాయి. తరచుగా నేలపై కూర్చుని లేచేవారిలో ఎముకలు, కండరాలు దృఢంగా మారి వృద్ధాప్యంలో కింద పడి ఎముకలు విరిగే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.

నేటి నుంచే అలవాటు చేసుకోండి: నేలపై సుఖాసనంలో కూర్చోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మోకాళ్లు పైకి లేచినట్లు అనిపిస్తే, మెల్లగా వాటిని కిందకు నొక్కడం వల్ల ‘అడక్టర్’ (Adductor) కండరాలు వృద్ధి చెంది శరీరం సరైన ఆకృతిని (Posture) పొందుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఆయుష్షును పెంచుకోవడానికి నేలపై కూర్చోవడం ఉత్తమ మార్గం. సుఖాసనం చేద్దాం.. సుఖంగా ఉందాం!


Posted

in

by

Tags: