ఒళ్లంతా చల్లబరిచి, పాదాల మంటను తగ్గించే జ్యూస్! ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎండ వేడి వల్ల చాలా మందికి అరచేతులు, అరకాళ్లు మంట పుట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. రాత్రిపూట పాదాల మంట వల్ల నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు చాలా మంది ఉంటారు. దీనికి నీళ్లతో కడగడం లేదా క్రీములు రాసుకోవడం తాత్కాలిక పరిష్కారాలే. కానీ, శాశ్వతంగా శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన జ్యూస్ తయారీ విధానం ఇక్కడ ఉంది.

కావలసిన పదార్థాలు:

  • సోంపు గింజలు
  • పటిక బెల్లం
  • బాదం పప్పులు

తయారీ విధానం:

  1. ముందుగా ముప్పావు కప్పు సోంపు గింజలను పాన్ లో వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. మరీ ఎర్రగా అవ్వక్కర్లేదు, కొంచెం వేడైతే చాలు. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  2. అదే పాన్ లో బాదం పప్పులను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. పటిక బెల్లాన్ని చిన్న ముక్కలుగా దంచి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన సోంపు, బాదం పప్పులు మరియు పటిక బెల్లం వేసి మెత్తని పౌడర్‌లా మిక్సీ పట్టాలి.
  5. ఈ పొడిలో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.

ఎలా సేవించాలి?: ఒక గ్లాసు మామూలు నీటిలో (మరీ చల్లని నీరు లేదా వేడి నీరు కాకుండా) ఈ పొడిని కలిపి తాగాలి. రుచి కోసం నిమ్మరసం లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు.


Posted

in

by

Tags: