ఒళ్లంతా వణికిపోతోంది..! “నడి రోడ్డుపై అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకున్న బస్సు”.. డ్రైవర్ వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. వైరల్ అవుతున్న ఉత్కంఠభరితమైన వీడియో..!!

మహారాష్ట్రలోని దక్షిణ ముంబై కొలాబా ప్రాంతంలోని సాసూన్ డాక్ సమీపంలో ఈరోజు ఉదయం ఓ ప్రభుత్వ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

కొలాబా డిపో నుంచి గీతా నగర్ వైపు వెళ్తున్న ‘బెస్ట్’ (BEST) సంస్థకు చెందిన బస్సులో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సాసూన్ డాక్ బస్టాప్ సమీపానికి రాగానే, బస్సు ఇంజిన్‌ను స్టార్ట్ చేసే ‘స్టార్టర్’ భాగంలో అకస్మాత్తుగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి.

ఆ వెంటనే బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో పాటు కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించాయి. రోడ్డుపై ఆగి ఉన్న బస్సులోంచి పొగలు రావడాన్ని చూసిన స్థానికులు షాక్‌కు గురై లోపల ఉన్న వారిని రక్షించేందుకు పరుగెత్తుకొచ్చారు. ఈ క్రమంలో బస్సులోని అగ్నిమాపక పరికరాన్ని (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్) ఉపయోగించి ముందుగా మంటలను ఆర్పేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నీళ్లు చల్లి బస్సులో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఒక్క ప్రయాణికుడు మాత్రమే ఉన్నాడని, డ్రైవర్, కండక్టర్ల సమయస్ఫూర్తితో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు లేకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారని సమాచారం.

అయితే ఈ అగ్నిప్రమాదంలో బస్సు భారీగా ధ్వంసమైంది. ఈ ఘటనపై బస్సు కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందించగా, కొలాబా డిపో అధికారి ఒకరు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *