“ఓట్ల దొంగ మోదీ” — బెంగళూరు ఆందోళనలో CJP నినాదాల హోరు.. దేశవ్యాప్తంగా సంచలనం!

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయ”ఓట్ల దొంగ మోదీ” – బెంగళూరు నిరసనలో CJP సంచలన నినాదాలు.. దేశవ్యాప్తంగా పెను దుమారం..!!

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిజెపి (CJP) సంస్థ తమ దేశవ్యాప్త పోరాటాన్ని ఉధృతం చేసింది.

ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలో చేపట్టిన భారీ ఆందోళనల తర్వాత, తాజాగా కర్ణాటకలోని బెంగళూరు నగరంలో గల చారిత్రక ఫ్రీడం పార్క్ (Freedom Park) వేదికగా CJP ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ నిరసనలో భాగంగా, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళనకారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి’ అని, ‘ఓట్ల దొంగ మోదీ’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, సిజెపి ముఖ్య నాయకులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

బెంగళూరు నిరసన అనంతరం, తమ ఉద్యమంలో తదుపరి కార్యాచరణగా రాబోయే అక్టోబర్ 10న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు CJP అధికారికంగా ప్రకటించింది. దేశ రాజధాని వైపు కదులుతున్న ఈ తదుపరి పోరాట ప్రకటన జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను, సంచలనాన్ని రేకెత్తించింది.


Posted

in

by

Tags: