కంటి చూపు అవసరానికి తగ్గట్టుగా పవర్ మార్చుకునే ‘స్మార్ట్ గ్లాసెస్’: ఇక బైఫోకల్ లెన్స్‌లకు గుడ్‌బై!

మీకు చూపు తక్కువగా ఉందా? అయితే స్టైలిష్‌గా ఉండటమే కాకుండా టెక్నాలజీతో పనిచేసే ఈ సరికొత్త ‘స్మార్ట్ గ్లాసెస్’ గురించి తెలుసుకోండి. సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారికి దగ్గరి చూపు, దూరపు చూపు కోసం విడివిడిగా లేదా బైఫోకల్ లెన్స్‌లు అవసరమవుతాయి. కానీ IXI సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఆటోఫోకస్ కళ్లజోడుతో ఆ సమస్యలన్నీ తీరిపోనున్నాయి.

బైఫోకల్, వెరిఫోకల్ లెన్స్‌ల శకానికి ముగింపు!

1700వ కాలంలో బెెంజమిన్ ఫ్రాంక్లిన్ బైఫోకల్ లెన్స్‌లను కనిపెట్టారు. ఆ తర్వాత 1960లో వెరిఫోకల్ లెన్స్‌లు వచ్చాయి. అయితే వీటిలో అంచుల వైపు చూపు మసకగా కనిపించడం, ధర ఎక్కువగా ఉండటం వంటి ఇబ్బందులు ఉన్నాయి. IXI ఆటోఫోకస్ కళ్లజోడులో ఎక్కడా ఫిక్స్‌డ్ ఏరియా ఉండదు; లెన్స్ మొత్తం మీ కంటి అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంది.

ఈ మాయా టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో రెండు ప్రధాన ఫీచర్లు ఉన్నాయి:

  1. ఐ-ట్రాకింగ్ సెన్సార్స్ (Eye-Tracking Sensors): ఇవి మీ కంటిపాప కదలికలను నిరంతరం గమనిస్తుంటాయి. మీరు మొబైల్ లేదా పుస్తకం వంటి దగ్గరి వస్తువులను చూస్తున్నప్పుడు ఈ సెన్సార్స్ వెంటనే గుర్తిస్తాయి.
  2. లిక్విడ్ క్రిస్టల్ లెన్స్ (Liquid Crystal Lenses): సెన్సార్ల నుండి సిగ్నల్ అందగానే, ఈ లెన్స్‌లు క్షణాల్లో తమ పవర్‌ను మార్చుకుంటాయి. ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుందంటే, పవర్ మారిందన్న విషయం యూజర్‌కు కనీసం తెలియదు కూడా.
ప్రధాన ప్రత్యేకతలు:
  • చాలా తక్కువ బరువు: బ్యాటరీ, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉన్నప్పటికీ వీటి బరువు కేవలం 22 గ్రాములు మాత్రమే. సాధారణ ప్లాస్టిక్ కళ్లజోడులంత బరువు ఉండటం వల్ల రోజంతా హాయిగా ధరించవచ్చు.
  • అడ్జస్టబుల్ రీడింగ్ ఏరియా: మీరు దగ్గరి వస్తువులను చూస్తున్నప్పుడు రీడింగ్ ఏరియా వెడల్పుగా మారుతుంది. దూరాన్ని చూస్తున్నప్పుడు అది ఆటోమేటిక్‌గా మాయమైపోయి లెన్స్ మొత్తం క్లియర్‌గా మారుతుంది.
  • మ్యాగ్నెటిక్ ఛార్జింగ్: కళ్లజోడు ఫ్రేమ్ చివరన రహస్యంగా ఉండే మ్యాగ్నెటిక్ పోర్ట్ ద్వారా వీటిని సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఫెయిల్ సేఫ్ మోడ్ (FailSafe Mode):

ఒకవేళ బ్యాటరీ అయిపోయినా లేదా ఎలక్ట్రానిక్ సిస్టమ్ పనిచేయకపోయినా భయపడాల్సిన పనిలేదు. వెంటనే ఈ కళ్లజోడు ‘ఫెయిల్ సేఫ్ మోడ్’లోకి మారిపోయి, సాధారణ దూరపు చూపు పవర్‌కు సెట్ అయిపోతుంది. దీనివల్ల యూజర్‌కు అకస్మాత్తుగా చూపు మందగించడం వంటి ఇబ్బందులు కలగవు.


Posted

in

by

Tags: