నోయిడా: నోయిడాలోని రబూపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ‘సూర్య గ్లోబల్ ఫ్లెక్సీ ఫిల్మ్’ కంపెనీలో అత్యంత అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది. అక్కడ పనిచేస్తున్న ఒక కార్మికుడిని హతమార్చాలనే ఉద్దేశంతో.. అదే సంస్థలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు అతడి ప్రైవేట్ పార్ట్లో ఎయిర్ ప్రెషర్ పైపును చొప్పించారు.
కంప్రెషర్ నుండి వచ్చిన తీవ్రమైన గాలి ఒత్తిడి (ఎయిర్ ప్రెషర్) కారణంగా ఆ యువకుడి లోపలి పేగులు పూర్తిగా పగిలిపోయాయి. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఊడుస్తుండగా దారుణం..
రబూపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శ్యామ్ బాబు శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య గ్లోబల్ ఫ్లెక్సీ ఫిల్మ్ కంపెనీ ప్లాంట్ హెడ్ ధర్మేంద్ర సెంగర్ గత రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆయన కంపెనీలో కొందరు వ్యక్తులు కాంట్రాక్ట్ పద్ధతిలో క్లీనింగ్ మరియు తుడిచే పనులు చేస్తుంటారు.
ఆయన ఫిర్యాదు ప్రకారం.. కంపెనీలో పనిచేసే సమీర్ అనే యువకుడు వంగి ఊడుస్తుండగా ,అక్కడే పనిచేస్తున్న దిల్షాద్ మరియు జీషాన్ అనే ఇద్దరు వ్యక్తులు సమీర్ గుదద్వారంలో ఎయిర్ కంప్రెషర్ పైపును పెట్టారు. ఒక్కసారిగా గాలి లోపలికి వెళ్లడంతో అతడి పేగులు పగిలి బయటకు వచ్చాయి. తీవ్ర రక్తస్రావంతో స్పృహతప్పిన సమీర్‌ను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు.
ఈ అమానుష ఘటనపై ప్లాంట్ హెడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కంపెనీల్లో సరదా కోసం లేదా గొడవల కారణంగా సహోద్యోగుల ప్రైవేట్ భాగాల్లో ఎయిర్ పైపులు పెట్టి ప్రాణాల మీదకు తెస్తున్న ఇలాంటి వికృత చేష్టలు ఇటీవల కాలంలో పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply