“కటింగ్ మెషిన్‌తో పురుషాంగాన్ని కోసుకుని”.. పుర్రె పగిలి, ఊపిరితిత్తులు చిట్లి.. ప్రముఖ మహారాజ్ శిష్యుడి మృతిలో ఊహించని మలుపు.. పోస్ట్‌మార్టమ్‌లో షాకింగ్ విషయాలు..!!

ఆధ్యాత్మిక క్షేత్రమైన బృందావనంలో ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడైన రసిక్ దులారీ శరణ్ (అలియాస్) దీపక్ లోధి (25) మరణించిన ఘటన రోజురోజుకూ సంచలన మలుపులు తిరుగుతోంది.

ప్రారంభంలో ఇది ఆత్మహత్య కేసుగా భావించినప్పటికీ, వరుసగా వెలుగులోకి వస్తున్న ఆధారాలు, సమాచారం అందరినీ నివ్వెరపరుస్తున్నాయి.

ఈ ఘటనపై బృందావనం సర్కిల్ పోలీస్ అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రాథమికంగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించినప్పుడు దీపక్ లోధి భవనం పైకప్పు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. అయినప్పటికీ, అతని కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాల ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు, ఆశ్రమవాసుల సాయంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ కేసులో అతిపెద్ద మలుపుగా, దీపక్ లోధి నివసించిన గదిని తనిఖీ చేయగా అక్కడ ఒక ఎలక్ట్రిక్ గ్రైండర్ (కటింగ్ మెషిన్) లభ్యమైంది. అంతేకాకుండా అతని గుప్తంగం కోతకు గురైనట్లు దర్యాప్తులో తేలింది. భవనం పైనుంచి కిందకు దూకడానికి ముందే అతను ఆ ఎలక్ట్రిక్ గ్రైండర్‌తో తనను తాను గాయపరుచుకున్నాడా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.

మధురలో నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ నివేదికలో, “అధిక రక్తస్రావం కావడం వల్ల కలిగిన షాక్ (ఆఘాతం) మరణానికి ప్రధాన కారణం” అని పేర్కొన్నారు. తల, పెదవి, గడ్డం భాగాల్లో లోతైన కోత గాయాలు, పుర్రె వెనుక భాగంలో పగుళ్లు, ఛాతీ ఎముకలు విరిగి ఎడమ ఊపిరితిత్తి చిట్లిపోవడం మరియు గుప్తాంగం తుండటం వంటి దారుణమైన గాయాలను పోస్ట్‌మార్టమ్‌‌లో గుర్తించారు.

బంధువుల సమక్షంలో దీపక్ లోధి అంత్యక్రియలు బృందావనంలోనే పూర్తికాగా, “ఈ విషాదకరమైన ఘటనలో ఎలాంటి అనుమానాన్నీ పోలీసులు నిర్లక్ష్యం చేయరని; ఆశ్రమవాసులు, బంధువులను విచారించి అసలు నిజాలను బయటకు రప్పిస్తామని” పోలీస్ అధికారి సంజీవ్ కుమార్ హామీ ఇచ్చారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *