కఠినమైన అటవీ మార్గం..! రైలు వెళ్తుండగా పట్టాలపై అకస్మాత్తుగా నిల్చున్న బాలుడు. వెంటనే సడన్ బ్రేక్ వేసిన లోకో పైలట్. వైరల్ అవుతున్న ఉత్కంఠభరిత వీడియో.!

కజకిస్థాన్: సార్యోజెక్ – ఉష్టోబే (Saryozek – Ushtobe) రైల్వే మార్గంలో సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది.

గంటకు సుమారు 38 కి.మీ వేగంతో వెళ్తున్న రైలు డ్రైవర్, పట్టాల సమీపంలో ఒక బాలుడు నిలబడి ఉండటాన్ని గమనించాడు.

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలిపివేశాడు. ఆ తర్వాత ఆ బాలుడిని సురక్షితంగా లోకోమోటివ్ క్యాబిన్‌లోకి తీసుకొచ్చిన డ్రైవర్, వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు.

ఐనా-బులాక్ (Aina-Bulak) స్టేషన్ విధుల్లో ఉన్న అధికారికి ఆ బాలుడిని సురక్షితంగా అప్పగించారు. అనంతరం ట్రాన్స్‌పోర్ట్ పోలీసులకు బదిలీ చేశారు. ఉష్టోబే స్టేషన్ అధికారులు ఆ చిన్నారి తల్లిదండ్రులను గుర్తించి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

చిన్నారి భద్రతను నిర్ధారించడంలో విఫలమైనందుకు గానూ అతడి తల్లిపై అడ్మినిస్ట్రేటివ్ (పరిపాలనాపరమైన) కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *