“కదులుతున్న రైలులో మరో దారుణం.” యువతిపై లైంగిక వేధింపులు.. నిలదీసినందుకు ముఖంపై కొట్టి, స్పృహతప్పేలా దాడి చేసిన 39 ఏళ్ల కామాంధుడు.!!!

కేరళలో కదులుతున్న రైలులో 25 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా, ఆమె స్పృహ కోల్పోయే వరకు కిరాతకంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

తిరువనంతపురం వెళ్తున్న మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

చిరయిన్‌కీజు ప్రాంతం నుంచి డ్యూటీకి వెళ్లేందుకు రైలెక్కిన ఆ యువతితో 39 ఏళ్ల వ్యక్తి పదేపదే అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. రద్దీ కారణంగానే అతడు తగులుతున్నాడని మొదట భావించిన బాధితురాలు.. ఆ తర్వాత అతని ఉద్దేశాన్ని పసిగట్టి వెంటనే తీవ్రంగా ప్రతిఘటించింది.

రైలు పేట (Pettai) రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే, సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని యువతి హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు, రైలు దిగిన ఆమె ముఖంపై బలంగా కొట్టి, ప్లాట్‌ఫారమ్‌పైకి నెట్టేసి కాలితో తన్నాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్లాట్‌ఫారమ్‌పైనే స్పృహతప్పి పడిపోయింది.

అక్కడున్న ప్రయాణికులు వెంటనే జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని పట్టుకుని తంపనూర్ రైల్వే పోలీసులకు అప్పగించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్ల కింద నిందితుడిని వెంటనే అరెస్టు చేసిన పోలీసులు, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *