కనుబొమ్మలే కాదు.. గడ్డం, మీసాలు కూడా దట్టంగా పెరుగుతాయి; ఏళ్ల తరబడి పరీక్షించి విజయం సాధించిన మార్గం!

ముఖ సౌందర్యంలో కనుబొమ్మలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎంత సమయం కేటాయించి ముస్తాబైనప్పటికీ, కనుబొమ్మలు అందంగా లేకపోతే ముఖంలో ఏదో వెలితిగా అనిపిస్తుంది.

కనుబొమ్మలు దట్టంగా కనిపించడం కోసం ఐబ్రో పెన్సిల్, ఐబ్రో జెల్ వంటి సౌందర్య సాధనాలను ఉపయోగించేవారు చాలామంది ఉన్నారు. అయితే, ఇటువంటి వస్తువులను సరిగ్గా ఉపయోగించకపోతే ఆశించిన ఫలితం దక్కదు. ఎటువంటి ఖరీదైన వస్తువుల అవసరం లేకుండానే కనుబొమ్మలను సహజంగా అందంగా, దట్టంగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను సరిగ్గా పాటిస్తే కనుబొమ్మలను ‘థ్రెడ్డింగ్’ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంతేకాకుండా, మీసాలు మరియు గడ్డం పెరగడానికి కూడా ఈ పద్ధతి మీకు సహాయపడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారు చేసే విధానం చూద్దాం. మొదటి ఉపయోగింలోనే ఫలితాన్ని గమనించవచ్చు.

కావలసిన పదార్థాలు:
  • బాదం పప్పులు – 4
  • ఆముదం (Castor Oil) – తగినంత
తయారు చేసే విధానం:

ముందుగా బాదం పప్పులను బాగా వేడి చేసి, అవి నల్లగా మాడిపోయేలా (కాల్చి) చేయాలి. అవి చల్లారిన తర్వాత వాటిని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా ఆముదాన్ని కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. మీకు కావాల్సిన పరిమాణంలో దీనిని తయారు చేసుకుని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇది చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.

ఉపయోగించే విధానం:

ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు లేదా గడ్డం/మీసాలకు రాసుకోవాలి. ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. ఒక్కసారి ఉపయోగించినప్పుడే మీకు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.


Posted

in

by

Tags: