“కన్నీటితో వీడియో విడుదల చేసిన మహిళా మంత్రి..!” నా పిల్లలను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం.. భర్తపై రెండో పెళ్లి, హత్యాయత్నం ఫిర్యాదు చేసిన మంత్రి రేఖా ఆర్య.. సంచలన ఎఫ్ఐఆర్ నమోదు..!!

ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య, తన భర్త గిర్ధారి లాల్ సాహుపై హత్యాయత్నం, కులం పేరుతో దూషించడం, మోసం చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనకు అప్పటికే వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని, వాటిని ప్రశ్నించినప్పుడు తనపై దాడి చేశాడని మంత్రి ఆరోపించారు.

తనను, తన పిల్లలను చంపడానికి తన భర్త కుట్ర పన్నుతున్న ఆడియో సంభాషణ తనకు దొరికిందని, దీనివల్ల తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆమె ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

ఈ పరిణామాలతో తీవ్ర మానసిక క్షోభకు గురైన మంత్రి రేఖా ఆర్య ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహిళకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక సాధారణ మహిళల భద్రత పరిస్థితి ఏంటని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *