వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి దేశం కోసం ఆడిన ఇషాన్ కిషన్ మనోధైర్యం మరియు అంకితభావం అభిమానులను కలచివేసింది. ఫైనల్ మ్యాచ్కు ముందు రోజు జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఇషాన్ సోదరి (కజిన్) మరియు ఆమె భర్త మరణించారు.
అంతటి తీరని దుఃఖంలోనూ, తన కన్నీటిని గుండెల్లోనే దాచుకుని జట్టు కోసం బరిలోకి దిగిన ఇషాన్, అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం, ఈ విజయాన్ని తన దివంగత సోదరికి అంకితం ఇచ్చారు.
