బంగ్లాదేశ్‌లోని బరిసాల్ (Barisal) ప్రాంతానికి చెందిన ఓ జంటకు వివాహమై 7 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు.
పలుచోట్ల వైద్య పరీక్షలు చేయించిన తర్వాత, భార్యకు సంతాన భాగ్యం కలిగే అవకాశం లేదని తేలింది.
దీంతో ఆగ్రహించిన భర్త, తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించారు. ఆ పంచాయతీలో, తనకు విడాకులు ఇవ్వకూడదంటూ ఆ మహిళ తన భర్త కాళ్లపై పడి కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ బతిమిలాడింది.
కానీ, భార్య ఎంత హృదయవిదారకంగా వేడుకున్నా లెక్కచేయని భర్త తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. చివరగా, పిల్లలు లేరనే ఒకే ఒక్క కారణంతో 7 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు.
పంచాయతీలో ఆ మహిళ తన భర్త కాళ్లపై పడి ఏడ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చూసేవారిని కంటతడి పెట్టిస్తుండటంతో పాటు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Leave a Reply