“కన్న కడుపు తరుక్కుపోదా..?” మగబిడ్డ పుట్టలేదని ఇంత దారుణమా..? పుట్టిన కొద్ది నిమిషాల్లోనే పసికందును చంపి పూడ్చిపెట్టిన తల్లి.. 3 రోజుల ముందే తవ్విన గొయ్యి.. షాకింగ్ ఘటన..!!

అస్సాం రాష్ట్రంలో పుట్టిన కొద్ది నిమిషాల్లోనే ఆడబిడ్డను చంపి, ఇంటి వెనుక పూడ్చిపెట్టిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది.

ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో, బిడ్డ పుట్టడానికి 3 రోజుల ముందే తవ్విన గోతిలో ఆ పసికందును పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. అనుమానం వచ్చిన గ్రామస్తులు ఆ ప్రదేశాన్ని తవ్వి చూడగా, శిశువు మృతదేహం బయటపడింది.

వెలికితీసిన ఆ పసికందు మెడకు తాడు కట్టి ఉండటం గమనించి గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బిడ్డను చంపిన నేరంపై తల్లిదండ్రులిద్దరినీ అరెస్టు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు. ఇప్పటికే ఒక ఆడపిల్ల ఉండటంతో, మగబిడ్డ కావాలనే ఆశతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *