“కరోనా కాలమే ఆ తర్వాత వైవాహిక జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది!”.. దంపతుల మధ్య పెరుగుతున్న విడాకులు.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన..!!!

కరోనా మహమ్మారి విజృంభణ, ఆ సమయంలో విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు ఎంతోమంది వైవాహిక జీవితాలను, కుటుంబ బంధాలను తీవ్రంగా దెబ్బతీశాయని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కుటుంబ కలహాల కేసుల విచారణ సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో, న్యాయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యంగా 2019 నుంచి 2022 మధ్య కరోనా కాలంలో పెళ్లిళ్లు చేసుకున్న ఎంతోమంది దంపతుల సంసార జీవితం కేవలం 6 నుంచి 9 నెలల వ్యవధిలోనే బీటలు వారి విడాకుల వరకు వెళ్లిందని న్యాయస్థానం ఎత్తిచూపింది. లాక్‌డౌన్ రోజుల్లో ఇళ్లకే పరిమితమైన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ నిరంతరం ఇంట్లోనే కలిసి ఉండాల్సి రావడం ఊహించని విభేదాలకు, ఘర్షణలకు దారితీసిందని పేర్కొన్నారు.

ఆ క్లిష్టమైన ఏకాంత పరిస్థితుల్లో మనుషుల మంచి గుణాలతో పాటు దాగి ఉన్న ఎన్నో లోపాలు, చెడు స్వభావాలు కూడా బయటపడ్డాయని జడ్జి అభిప్రాయపడ్డారు. నిరంతర మానసిక ఒత్తిడి, పరస్పర అవగాహన లోపం కారణంగా ఎన్నో కుటుంబాల్లో వైవాహిక బంధాలు తాత్కాలిక సమస్యల నుంచి శాశ్వత విడిపోతలకు దారితీశాయని, కరోనా మిగిల్చిన తీవ్రమైన విషాదపు మచ్చల్లో ఇది ఒకటని కేసుల విచారణ స్పష్టం చేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *