కరోనా తర్వాత మళ్లీ భారీ లాక్డౌన్? ప్రపంచవ్యాప్తంగా మొదలైన సన్నాహాలు!

ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం ఇప్పుడు భయంకరమైన రూపాన్ని సంతరించుకుంది. యుద్ధం మొదలై 23 రోజులు గడుస్తున్నా శాంతి నెలకొనే సూచనలు కనిపించడం లేదు.

ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో భారత్‌తో సహా అనేక దేశాల్లో ఇంధన కొరత ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 112 డాలర్లకు చేరుకున్నాయి. అమెరికాలో గ్యాస్ ధర గ్యాలన్‌కు 5 డాలర్లకు పెరిగింది. రవాణా ఖర్చులు పెరగడంతో ప్రతి వస్తువు ప్రియమవుతోంది. ఈ ఇంధన కొరత మరియు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందా? అన్న ఆందోళన మొదలైంది.

ప్రమాదంలో ఆహార భద్రత: యుద్ధం కారణంగా దుకాణాల్లో వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పంటలకు అవసరమైన ఎరువులు కూడా గల్ఫ్ దేశాల నుండే రావాల్సి ఉండటంతో ఆహార భద్రత ముప్పులో పడింది. ఎరువుల ధరలు పెరిగితే ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

విమాన ప్రయాణాలపై ప్రభావం: ఇంధన కొరత ప్రభావం విమానయాన రంగంపై కూడా పడింది. ‘యునైటెడ్ ఎయిర్‌లైన్స్’ ఈ వారం తమ విమాన సర్వీసుల్లో 5 శాతాన్ని తగ్గించింది. ఇతర దేశాల విమాన సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప విమాన ప్రయాణాలు చేయవద్దని ప్రభుత్వాలు కోరుతున్నాయి. సరిగ్గా కరోనా సమయంలో కూడా తొలుత ఇలాంటి విజ్ఞప్తులే చేసి, ఆ తర్వాత లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన రేషనింగ్: అనేక దేశాల్లో ఇంధన కోటాను (Rationing) విధిస్తున్నారు. జపాన్‌లో ఇప్పటికే చమురు రేషనింగ్ ప్రారంభమైంది. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ మరియు శ్రీలంకలో పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరింది. భారత్‌కు వచ్చే చమురులో 80 శాతం హోర్ముజ్ జలసంధి నుండే వస్తుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ను చమురు కొరత మరిన్ని కష్టాల్లోకి నెట్టింది.

అంతర్జాతీయ శక్తి సంస్థ (IEA) 10 సూత్రాల ప్రణాళిక: ఇంధన సంక్షోభం నుండి రక్షణ కోసం IEA పది సూత్రాల ప్రణాళికను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది:

  • వాహనాల నంబర్ ప్లేట్ ఆధారంగా రోడ్డుపైకి వచ్చే రోజులను నిర్ణయించడం.
  • హైవేలపై వేగ పరిమితిని తగ్గించడం.
  • విమాన ప్రయాణాలను వీలైనంత వరకు నివారించడం.
  • గ్యాస్ స్టవ్‌లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్‌లను వాడటం.
  • సాధ్యమైనంత వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుండే పని) చేయడం.

ఒకవేళ యుద్ధం ఇంకా కొనసాగి, చమురు ధరలు మరింత పెరిగితే.. రవాణా, వ్యవసాయం, విమానయానం అన్నీ భారంగా మారుతాయి. అప్పుడు వివిధ దేశాలు ‘డిజిటల్ పర్మిట్ సిస్టమ్’ను శాశ్వత ప్రాతిపదికన అమలు చేసే అవకాశం ఉంది. దీని ద్వారా మీ కారు వాడకం, ప్రయాణాలు మరియు గృహోపకరణాల వినియోగాన్ని ప్రభుత్వం నియంత్రించవచ్చు.


Posted

in

by

Tags: