భారతదేశంలో పురుషుల లైంగిక ఆరోగ్యంపై ఉన్న సామాజిక నిశ్శబ్దం కారణంగా పురుషాంగం ముందు చర్మ సమస్యలను (Foreskin Problems) తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ సమస్య కేవలం శారీరక నొప్పిని మాత్రమే కాకుండా, లైంగిక సంబంధాలు, ఆత్మవిశ్వాసం మరియు మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
పురుషాంగం ముందు చర్మం పదేపదే పగులుతుంటే, అది శరీరంలో ఏదో తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
ముందు చర్మ సమస్య (Foreskin Problem) అంటే ఏమిటి? పురుషాంగం ముందు భాగంలో ఉండే చర్మం వాపుకు గురవ్వడం, పగలడం లేదా ఎరుపు రంగులోకి మారి దద్దుర్లు రావడం వంటి స్థితిని ఇలా పిలుస్తారు. దీనికి కారణాలు ఇవే కావచ్చు:
- విపరీతమైన రాపిడి (Friction)
- అసురక్షిత లైంగిక సంబంధం
- బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్
- ఫిమోసిస్ (Foreskin వెనక్కి వెళ్లకపోవడం)
- బాలనైటిస్ (పురుషాంగం ముందు భాగం వాపు)
- అలర్జీ లేదా చర్మ వ్యాధులు
తరచుగా పగలడానికి కారణాలు:
- ఫిమోసిస్ మరియు బాలనైటిస్: ఫిమోసిస్ ఉన్నప్పుడు చర్మం చాలా టైట్‌గా ఉండి వెనక్కి రాదు. దీనివల్ల శుభ్రం చేయడం కష్టమై బ్యాక్టీరియా పేరుకుపోతుంది, ఫలితంగా చర్మం పగులుతుంది.
- రాపిడి: తగినంత లూబ్రిికేషన్ లేకుండా కలయికలో పాల్గొనడం లేదా అతిగా హస్తప్రయోగం చేయడం వల్ల చర్మానికి చిన్న గాయాలై, అవి పగుళ్లుగా మారుతాయి.
- ఇన్ఫెక్షన్ మరియు అలర్జీ: నాణ్యత లేని కాండమ్స్ లేదా కెమికల్స్ ఉన్న సబ్బులు వాడటం వల్ల అలర్జీలు రావచ్చు.
పరిష్కార మార్గాలు:
- శుభ్రత: ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో పురుషాంగాన్ని శుభ్రం చేసుకోవాలి.
- వైద్య చికిత్స: డాక్టర్ల సలహా మేరకు స్టెరాయిడ్ క్రీములు లేదా యాంటీ ఫంగల్ మందులు వాడాలి.
- శస్త్రచికిత్స (Circumcision): సమస్య మరీ తీవ్రంగా ఉంటే, డాక్టర్లు ఆపరేషన్ ద్వారా ఆ అదనపు చర్మాన్ని తొలగించే ‘సర్కమ్‌సిషన్’ను సూచిస్తారు.
