బీహార్‌కు చెందిన అర్చన అనే యువతికి 2025లో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత తాను ఉన్నత చదువులు చదవాలని కోరడంతో.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె భర్త, అర్చన కోచింగ్ ఫీజులు, రూమ్ రెంట్, భోజనం మరియు పరీక్షల ఖర్చులన్నింటినీ తానే స్వయంగా భరించి మరీ చదివించాడు.
భర్త అందించిన ఆర్థిక సహాయం, ప్రోత్సాహంతో కష్టపడి చదివిన అర్చనకు బీహార్ పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చింది. అయితే, ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే ఆమె ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. భర్తతో మాట్లాడటం తగ్గించేసిన అర్చన.. ఓసారి సెలవుపై ఇంటికి వచ్చిన సమయంలో, ఆమె వాట్సాప్‌లో వివేక్ అనే వ్యక్తితో సాగించిన ప్రేమ సంభాషణలను (లవ్ చాట్స్) భర్త చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.
దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన అర్చన, తిరిగి విధుల్లో చేరిన అనంతరం తన ప్రియుడితో కలిసి పారిపోయినట్లు తెలుస్తోంది. గతంలో సంచలనం సృష్టించిన ‘జ్యోతి మౌర్య’ ఉదంతాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొంటూ.. భర్తకు జరిగిన అన్యాయం, మోసంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply