కామకోరిక కోసం కసాయిగా మారిన ప్రియుడు.. అడ్డుగా ఉందని ఏడాదిన్నర పసికందును నడిరోడ్డుపై అతి కిరాతకంగా చంపేశాడు! (వీడియో వైరల్)

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఏడాదిన్నర పసికందును తలకిందులుగా నేలకేసి కొట్టి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఫిరోజాబాద్‌కు చెందిన సుమిత్, రతి దంపతులకు ఆరవ్ (1.5 ఏళ్లు) అనే కుమారుడు ఉన్నాడు. అయితే, రతికి విరాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రతిని పెళ్లి చేసుకోవాలని ఆశపడిన విరాజ్, దానికి ఆమె ఏడాదిన్నర బాబు అడ్డుగా ఉన్నాడని భావించాడు.

గత శుక్రవారం రతి తన స్వగ్రామం నుండి ఫిరోజాబాద్‌లోని తన అత్తగారి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విరాజ్ అక్కడికి చేరుకున్నాడు. ఆడుకుంటున్న పసికందు ఆరవ్‌కు చాక్లెట్లు ఇప్పిస్తానని నమ్మించి, ఎవరూ లేని సందులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ పసివాడిని ఎత్తి నేలకు బలంగా కొట్టాడు. ఈ కిరాతక దాడిలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాబును విరాజ్ తీసుకెళ్లిన కొద్దిసేపటికే పసికందు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే బాబు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఘటన జరిగిన వెంటనే నిందితుడు విరాజ్ అక్కడి నుండి పరారయ్యాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ దారుణంపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ.. “ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: