“కామవాంఛతో ముగిసిన 3 రోజుల వైవాహిక జీవితం..!” వండి వార్చిన కొత్త పెళ్లికూతురికి అర్ధరాత్రి ఎదురైన ఘోరం.. 21 ఏళ్ల నిండు ప్రాణం బలి!

కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుమలత అనే 21 ఏళ్ల యువతి, గజేంద్రన్ అనే యువకుడిని ప్రేమించి బంధువుల సమక్షంలో ఆగస్టు 14న ఆలయంలో వివాహం చేసుకుంది.

వివాహం తర్వాత సుమలత తన భర్త గజేంద్రన్‌తో కలిసి అతని గొర్రెల కొట్టం వద్ద ఉంటోంది.

సంఘటన జరిగిన రోజు రాత్రి తన భర్తకు, అతని స్నేహితులకు భోజనం వండి వడ్డించిన తర్వాత, సుమలత కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒంటరిగా బయటకు వెళ్లింది. ఆ సమయంలో గజేంద్రన్ స్నేహితుడైన బొరేయా అనే వ్యక్తి ఆమెను రహస్యంగా వెంబడించాడు.

చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి బొరేయా, సుమలత నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా సమీపంలో గొర్రెలు మేపుతున్న తన సోదరుడు కరయ్యను కూడా అక్కడికి పిలిచాడు.

ఆ ఇద్దరూ కలిసి సుమలత మెడకు టవల్‌తో బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చారు. అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు మృతదేహాన్ని పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి పారిపోయారు.

రెండు రోజులుగా యువతి కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా, ఆగస్టు 16న బావిలో నుంచి సుమలత మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం నిందితులైన బొరేయా, కరయ్యలను అరెస్ట్ చేసింది. భర్త గజేంద్రన్‌తో సహా మిగిలిన వ్యక్తులను కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు.


Posted

in

by

Tags: