“కారులో కూడా కూర్చోలేని స్థితి.. BMI లెవెల్ 100 దాటి తీవ్ర దిగ్భ్రాంతి.. 275 కిలోల బరువుతో అల్లాడిన 16 ఏళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స.!!”

ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో, తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న 16 ఏళ్ల బాలుడికి బేరియాట్రిక్ సర్జరీని (Bariatric Surgery) వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల బాలుడు సుమారు 275 కిలోల బరువుతో తీవ్రమైన స్థూలకాయ సమస్యతో బాధపడుతూ వచ్చాడు.

అతని బాడీ మాస్ ఇండెక్స్ (BMI) దాదాపు 100కి చేరుకోవడంతో, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, నిద్రలేమి (స్లీప్ అప్నియా), చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ల వంటి పలు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.

శరీర బరువు విపరీతంగా పెరిగిపోవడంతో, ఆ బాలుడు సాధారణ కార్లలో కూడా కూర్చోలేని దయనీయ స్థితికి చేరాడు. దీంతో అతడిని ప్రత్యేకంగా ఓ వ్యాన్ ద్వారా సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రత్యేక వైద్య బృందం అతనికి అత్యాధునిక చికిత్స అందించి, క్లిష్టమైన బేరియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.


Posted

in

by

Tags: