కారులో మర్చిపోయిన లక్ష రూపాయల ఐఫోన్ 16.. వెతికి మరీ అప్పగించిన ఓలా డ్రైవర్. వృద్ధుడు చేసిన భావోద్వేగ పని. వైరల్ అవుతున్న వీడియో.!!

ముంబైలో ఓలా కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మీర్ షేక్ అనే వ్యక్తి నిజాయితీతో కూడిన పని ఇంటర్నెట్ వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది.

బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో తన రైడ్‌ను పూర్తి చేసిన మీర్ షేక్, కారు వెనుక సీటులో అత్యంత ఖరీదైన ఐఫోన్ 16 మొబైల్ ఫోన్ మర్చిపోబడి ఉండటాన్ని చూశాడు. తక్షణమే యజమానిని సంప్రదించడానికి వీలుకాని పరిస్థితుల్లో, దానిని ఎంతో భద్రంగా తన వద్దే ఉంచుకున్నాడు. కాసేపటికి ఆ సెల్‌ఫోన్‌కు కాల్ రాగా, దానిని పోగొట్టుకున్న వృద్ధుడు మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. కొంచెం కూడా సంకోచించకుండా, వెంటనే మలబార్ హిల్ ప్రాంతానికి కారు నడుపుకుంటూ వెళ్లి, ఆ ఐఫోన్‌ను యజమానికి సురక్షితంగా అప్పగించాడు.


Posted

in

by

Tags: