చైనాలోని అన్హుయ్ (Anhui) ప్రావిన్స్‌లో లోపల ఎవరూ లేని ఓ ఎలక్ట్రిక్ కారు, దానంతట అదే పార్కింగ్ చేసుకునేందుకు ప్రయత్నించిన వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాత్రి సమయంలో ఆ కారు స్వయంగా కదులుతూ పార్కింగ్ చేయడానికి ప్రయత్నించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ఎలక్ట్రిక్ కారు ఒకే రాత్రిలో ఏకంగా 868 సార్లు ముందుకు, వెనక్కి కదులుతూ పార్కింగ్ చేయడానికి ప్రయత్నించింది. అన్నిసార్లు ఆ కారు నిరంతరాయంగా కదులుతూనే ఉండటం చూసిన వారిని తీవ్ర ఆశ్చర్యానికి, గందరగోళానికి గురిచేసింది.
ఈ వింత ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. ప్రస్తుతం ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
లోపల మనిషి లేకుండానే ఆ కారు ఒకే రాత్రిలో 868 సార్లు ఇలా కదలడానికి కారణం ఏదైనా సాంకేతిక లోపమా? లేక ఎవరైనా రిమోట్ సాయంతో కారును ఆపరేట్ చేశారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనికి గల అసలు కారణం తెలిస్తేనే ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు బయటపడనున్నాయి.

Leave a Reply