కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, వాహనాల కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (పీయూసీ – PUC) చెల్లుబాటు కాలపరిమితిలో కొత్త మార్పులను తీసుకువచ్చింది.
కేంద్ర మోటారు వాహనాల (16వ సవరణ) నిబంధనలు, 2026 కింద నవంబర్ 19న విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. వాహనం కాలుష్య ఉద్గార ప్రమాణం, వాహనం వయసు మరియు అది వ్యక్తిగత వినియోగానిదా లేక వాణిజ్య వినియోగానిదా అనే అంశాల ఆధారంగా సర్టిఫికెట్ కాలపరిమితి నిర్ణయించబడుతుంది.
కొత్త నిబంధనల ప్రకారం, బీఎస్-6 (BS-6) ప్రమాణాలు కలిగిన వ్యక్తిగత వినియోగ వాహనాలు 6 సంవత్సరాల లోపు వయసు గలవైతే, వాటి పీయూసీ సర్టిఫికెట్ 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. 6 నుండి 10 సంవత్సరాల మధ్య వయసున్న వాహనాలకు ఏడాదికి ఒకసారి సర్టిఫికెట్‌ను పునరుద్ధరించుకోవాలి. 10 సంవత్సరాలు దాటిన వాహనాలకు ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త సర్టిఫికెట్ పొందడం తప్పనిసరి.
వాణిజ్య, రవాణా వినియోగంలో ఉన్న బీఎస్-6 వాహనాలకు ఈ నిబంధనలు కొంత భిన్నంగా ఉన్నాయి. 6 సంవత్సరాల లోపు ఉన్న వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ 2 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. 6 నుండి 10 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలకు ఏడాదికి ఒకసారి, 10 సంవత్సరాలు దాటిన వాహనాలకు 6 నెలలకు ఒకసారి సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేయించుకోవాలి.
పాత కాలుష్య ఉద్గార ప్రమాణాలు కలిగిన వాహనాలకు కూడా రెన్యువల్ కాలపరిమితిని స్పష్టం చేశారు. బీఎస్-1, బీఎస్-2, బీఎస్-3 వాహనాలకు ప్రతి 3 నెలలకు ఒకసారి, బీఎస్-4 వాహనాలకు ప్రతి 6 నెలలకు ఒకసారి పీయూసీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించుకోవాలి. వాహనాల నుండి వెలువడే పొగ నిర్దేశిత కాలుష్య పరిమితి లోపు ఉందని నిర్ధారించే ఈ సర్టిఫికెట్‌ను గుర్తింపు పొందిన కేంద్రాల్లో పరీక్ష చేయించుకుని పొందాల్సి ఉంటుంది.

Leave a Reply