గత రెండు మూడు రోజులుగా ఒక కార్పొరేట్ మహిళా ఉద్యోగి చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండటంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు “నీకు ఇతరుల వ్యక్తిగత విషయాలతో పనేంటి? నీ పని మీద దృష్టి పెట్టు” అని ఆమెకు సలహా ఇస్తుండగా, మరికొందరు కార్పొరేట్ సంస్కృతిపై విమర్శలు చేస్తున్నారు.
అంకిత్ పాండే అనే వ్యక్తి తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేసిన ఈ 31 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.
వైరల్ వీడియోలో యువతి ఏమంది?
“హలో ఫ్రెండ్స్, నేను మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. నాకు 21 ఏళ్లు, ఇక్కడ నేను ఒక్కదాన్నే సింగిల్. కానీ ఇక్కడ పని చేసే చాలా మందికి పెళ్లయి, మంచి భర్తలు ఉన్నప్పటికీ ఇతర పురుషులతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు. ఇవన్నీ చూశాక నాకు మంచి అబ్బాయి దొరుకుతాడనే నమ్మకం పోతోంది” అని ఆ యువతి తన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ యువతి ఎవరు? ఎక్కడ పని చేస్తుంది? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
నిశ్శబ్దంగా సాగుతున్న వివాహేతర సంబంధాలు:
ఈ వీడియోను షేర్ చేసిన అంకిత్ పాండే కూడా కార్పొరేట్ కార్యాలయాల్లో జరుగుతున్న మార్పుల గురించి సుదీర్ఘంగా రాశారు. “కార్పొరేట్ ఆఫీసులు వివాహేతర సంబంధాలకు నిలయాలుగా మారుతున్నాయి. ముంబైలోని నా స్నేహితుడు చెప్పిన ప్రకారం.. అతని ఆఫీసులో చాలా మంది వివాహిత మహిళలు సహోద్యోగులతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఆఫీస్ టూర్లను ప్రైవేట్ సెలవులలా ఎంజాయ్ చేస్తున్నారు” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఆఫీసు మూలల్లో సన్నిహితంగా ఉండటం, పబ్లిక్‌గా సరసాలాడుకోవడం వంటివి పెరిగిపోయాయని అంకిత్ ఆరోపించారు. ఇంట్లో భర్తలు మాత్రం తమ భార్య ఓవర్ టైం పని చేస్తోందని లేదా కెరీర్ కోసం కష్టపడుతోందని భావిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
చివరగా, “ప్రతి కంపెనీ లేదా ప్రతి మహిళ ఇలాగే ఉంటుందని నేను అనడం లేదు, కానీ నేటి ఆధునిక కార్పొరేట్ సంస్కృతిలో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి” అని అంకిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
