కిచెన్ సింక్‌లో నుంచి పాములా కనిపిస్తున్న ఓ జీవి బయటకు తొంగి చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
వీడియో చూసిన చాలామంది… “నిజంగానే సింక్‌లోకి పాము వెళ్లిందా?” అంటూ షాక్‌కు గురయ్యారు. మరికొందరు అది పామేనా? లేక మరేదైనా జీవినా? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో… దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటనే దానిపై పరిశీలన జరిగింది.
వైరల్ వీడియోను పరిశీలించినప్పుడు… ఇది నిజంగా జరిగిన ఘటనను చిత్రీకరించిన వీడియో కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన వీడియోగా సమాచారం వెలువడింది.
వీడియోలో సింక్లోపల నుంచి ఆ జీవి బయటకు తొంగి చూస్తున్న తీరు చాలా సహజంగా కనిపిస్తుంది. అందుకే చాలామంది మొదట దాన్ని నిజమైన పాముగా భావించారు.
కానీ ఫ్యాక్ట్ చెకింగ్‌లో ఈ వీడియో నిజమైన ఘటనకు సంబంధించినది కాదని, AI ద్వారా రూపొందించిన నకిలీ వీడియోగా పేర్కొంటున్నారు.

Leave a Reply