కుక్కల బోనులో 20 మంది బాలికలు.. 700 మంది పురుషుల చేతిలో ఘోరం! బ్రిటన్‌ను కుదిపేసిన బాధితురాలి వాంగ్మూలం

ఇంగ్లాండ్‌లో వెలుగుచూసిన ఒక దారుణమైన ఉదంతం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఒక భయంకరమైన లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటును కుదిపేసింది. బ్రిటన్‌లోని 85కి పైగా ప్రాంతాల్లో బాలికలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లు, సామూహిక అత్యాచారాలు మరియు క్రూరమైన హింసకు పాల్పడుతున్న ఒక ముఠా గురించిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

బాధితురాలి కన్నీటి గాథ: ఈ దారుణాల నుండి బయటపడిన ఒక బాధితురాలు పార్లమెంటులో ఇచ్చిన వాంగ్మూలం సభ్యులను నివ్వెరపరిచింది. “నాకు 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ ముఠా చేతిలో చిక్కుకున్నాను. ఆ తర్వాతి మూడేళ్లలోనే సుమారు 600 నుండి 700 మంది పురుషుల చేతిలో నేను సామూహిక అత్యాచారానికి గురయ్యాను” అని ఆమె కన్నీటి పర్యంతమైంది. మరొక బాధితురాలు, “జంతువులను ఉంచే కుక్కల బోనులలో 15 నుండి 20 మంది బాలికలను బంధించి ఉంచడాన్ని నేను స్వయంగా చూశాను” అని చెప్పడం గగుర్పాటు కలిగిస్తోంది.

నిందితులు ఎవరు? బ్రిటన్ ఎంపీ రూపర్ట్ లోవ్ స్వయంగా బాధితులతో మాట్లాడి, వారి వాంగ్మూలాలను పార్లమెంటులో చదివి వినిపించారు. ప్రభుత్వ విచారణల ప్రకారం, ఈ నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది పాకిస్థానీ సంతతికి చెందినవారేనని తేలింది. ముఖ్యంగా డ్రైవర్లు, స్థానిక మార్కెట్లలో వ్యాపారం చేసే వ్యక్తులు ఈ నెట్‌వర్క్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా పథకం ప్రకారమే బ్రిటన్‌లోని శ్వేతజాతీయులు మరియు క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన బాలికలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ అరాచకాలను సాగించింది.

పోలీసుల వైఫల్యం: 1997 నుండి 2013 మధ్య రోథర్‌హామ్ ప్రాంతంలోనే 1,400 మందికి పైగా చిన్నారులు ఈ పాశవిక దాడులకు గురయ్యారు. నిందితులపై చర్యలు తీసుకుంటే, తాము ‘జాతి వివక్ష’ చూపినట్లు విమర్శలు వస్తాయేమోనన్న భయంతో పోలీసులు మరియు స్థానిక అధికారులు చాలా కాలం పాటు ఈ విషయాన్ని దాచిపెట్టారు. ఇందులో కొంతమంది పోలీసు అధికారులకు కూడా సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటన బ్రిటన్ ప్రభుత్వం మరియు అక్కడి పోలీసు వ్యవస్థపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది.


Posted

in

by

Tags: