తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం తూప్రాన్‌కు సమీపంలోని దూబాకులపల్లి గ్రామానికి చెందిన కాశ సురేష్ (24) అనే యువకుడిని రెండు నెలల క్రితం ఓ వీధికుక్క కరిచింది.
అయితే కుక్క కాటును తేలిగ్గా తీసుకున్న సురేష్, సకాలంలో తీసుకోవాల్సిన యాంటీ-రేబీస్ వ్యాక్సిన్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాడు.
దీని ఫలితంగా కొన్ని రోజుల క్రితం అతడిలో రేబీస్ వ్యాధి లక్షణాలు బయటపడి, ఆరోగ్యం వేగంగా క్షీణించింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేక సురేష్ ప్రాణాలు విడిచాడు. కేవలం ఒక్క టీకాను నిర్లక్ష్యం చేయడం వల్ల 24 ఏళ్ల నిండు నూరేళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోవడం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply