బలోద్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో తన కూతురితో మాట్లాడవద్దని చెప్పినందుకు ఒక తండ్రిపై యువకుడు కిరాతకంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
ఏం జరిగిందంటే: బలోద్ జిల్లా సంబల్‌పూర్ గ్రామానికి చెందిన గౌకరణ్ సాహు కుమార్తె, భానుప్రతాప్ జైన్ అనే యువకుడితో స్నేహం చేస్తోంది. ఈ విషయం తెలిసిన తండ్రి, సదరు యువకుడిని పిలిచి తన కూతురితో మాట్లాడొద్దని హెచ్చరించాడు. అంతేకాకుండా ఆ యువకుడి తల్లిదండ్రులతో కూడా ఈ విషయాన్ని చర్చించాడు. దీనివల్ల కక్ష పెంచుకున్న భానుప్రతాప్, గౌకరణ్ సాహును అంతం చేయాలని ప్లాన్ చేశాడు.
హత్యాప్రయత్నం: జూన్ 30న అర్ధరాత్రి తన ఐదుగురు స్నేహితులతో కలిసి నిద్రిస్తున్న గౌకరణ్ సాహుపై దాడి చేశాడు. కర్రలతో తలపై తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో తండ్రి అరుపులకు కూతురు నిద్రలేచి కేకలు వేయడంతో, నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన గౌకరణ్ సాహు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నిందితుల అరెస్టు: బాధిత వ్యక్తి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడు భానుప్రతాప్ జైన్‌తో పాటు అతని ఐదుగురు స్నేహితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. కుమార్తెతో మాట్లాడొద్దని హెచ్చరించినందుకే ఈ దాడి జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Leave a Reply