ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంధాల పవిత్రతను కాలరాసేలా ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మాట్లాడలేని, వినబడని ఒక 20 ఏళ్ల దివ్యాంగ యువతి కన్నతండ్రి కామానికే బలైపోయింది. ఆమె అనుభవించిన నరకం తెలిశాక పోలీసులు, వైద్యులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు.
కడుపు నొప్పి వెనుక దాగి ఉన్న భయంకర నిజం యువతికి అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో ఈ ఘోరం బయటపడింది. ఆమె మాట్లాడలేకపోయినా, తన కడుపులో ఏదో ‘పాము లేదా పురుగు’ పాకుతున్నట్లు సంజ్ఞల ద్వారా తన నాయనమ్మకు వివరించింది. ఇంట్లో వారు అది గ్యాస్ సమస్య లేదా ఇన్ఫెక్షన్ అనుకున్నారు, కానీ వాస్తవం మరోలా ఉంది.
ఆసుపత్రి పరీక్షలో షాకింగ్ నిజం యువతి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఆ మూగ యువతి ఐదు నెలల గర్భవతి అని తేలింది. విషయం అత్యంత తీవ్రమైనది కావడంతో ఆసుపత్రి యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
DNA పరీక్షతో బయటపడ్డ మృగం యువతి దివ్యాంగురాలు కావడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. అనుమానం ఉన్న సుమారు 17 మంది DNA నమూనాలను సేకరించి పరీక్షించారు. ఆ నివేదికలో షాకింగ్ విషయం బయటపడింది. యువతిని గర్భవతిని చేసింది మరెవరో కాదు, ఆమె కన్నతండ్రే అని తేలింది. పోలీసులు వెంటనే నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
