“కూర్చున్న చోటే బరువు తగ్గొచ్చు!” ఇది చేస్తే చాలు, పొట్ట కరిగిపోతుంది.. నిపుణులు సూచిస్తున్న 5 రోజుల వర్కౌట్ సీక్రెట్..!!”

నేటి ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి కుర్చీలకే పరిమితమై పనిచేయడం వల్ల శరీర బరువు పెరగడమే కాకుండా, నడుము మరియు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతోంది.

ఇది గుండె జబ్బులతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణుడు ప్రబల్ శర్మ 5 రోజుల వర్కౌట్ ప్లాన్‌ను సూచించారు.

  • మొదటి రోజు (అప్పర్ బాడీ): ఇన్‌క్లైన్ డంబెల్ బెంచ్ ప్రెస్, వైడ్ గ్రిప్ కేబుల్ రోస్‌తో మొదలుపెట్టి మెషీన్ ఫ్లైస్, స్ట్రెయిట్ ఆర్మ్ పుల్‌డౌన్స్, డంబెల్ లేటరల్ రైజెస్, కేబుల్ ఫేస్ పుల్స్, చేతి కండరాల కోసం బైసెప్ కర్ల్స్ మరియు స్కల్ క్రషర్స్ చేయాలి.
  • రెండవ రోజు (లోయర్ బాడీ): మెషీన్ హిప్ అబ్డక్టర్, డెడ్‌లిఫ్ట్స్, లెగ్ ప్రెస్, లెగ్ ఎక్స్‌టెన్షన్స్, హ్యామ్‌స్ట్రింగ్ కర్ల్స్, స్టాండింగ్ కాఫ్ రైజెస్ మరియు కేబుల్ క్రంచెస్‌తో ముగించాలి.
  • మూడవ రోజు (పుష్ వర్కౌట్): ఛాతీ, భుజాలు, ట్రైసెప్స్ కండరాల కోసం ఇన్‌క్లైన్ డంబెల్ బెంచ్ ప్రెస్, పెక్ ఫ్లైస్, లేటరల్ రైజెస్, షోల్డర్ ప్రెస్ మరియు ఓవర్‌హెడ్ రోప్ ఎక్స్‌టెన్షన్స్ చేయాలి.
  • నాల్గవ రోజు (పుల్ వర్కౌట్): వీపు, భుజాలు, బైసెప్స్ కోసం చెస్ట్ సపోర్టెడ్ బెంట్ ఓవర్ రో, లాట్ పుల్‌డౌన్స్, రివర్స్ ఫ్లైస్, ప్రీచర్ కర్ల్స్ మరియు మణికట్టు వ్యాయామాలు చేయాలి.
  • ఐదవ రోజు (లెగ్స్ & కోర్): రెండవ రోజు లాగే కాళ్ల వ్యాయామాలు చేస్తూ, లెగ్ ప్రెస్‌కు బదులుగా స్క్వాట్స్ (Squats) సాధన చేయాలి.

ప్రతి వ్యాయామాన్ని 8 నుంచి 12 సార్లు (రెప్స్) చేయాలి. బరువును తరచూ మార్చకుండా, ఒకే బరువుతో అన్ని సెట్లలో 12 సార్లు సులభంగా చేయగలిగే స్థాయికి చేరాలి. ఆ తర్వాత మాత్రమే క్రమంగా బరువును పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పని వ్యాయామం, పట్టుదల మాత్రమే ఆరోగ్యకరమైన, ఫిట్‌గా ఉండే శరీరాన్ని అందిస్తాయి.


Posted

in

by

Tags: