కూర్చున్న చోటే 2.5 కోట్లు కొట్టేసిన దీపక్.. 90 కోట్ల ఆశతో రియల్ ఎస్టేట్ వ్యాపారికి షాక్!

రిజర్వ్ బ్యాంక్ (RBI)లో డబ్బు ఉందంటూ నమ్మబలికి ఓ యువకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి నుండి ఏకంగా ₹2.5 కోట్లు కాజేసిన ఘటన కోయంబత్తూరులో సంచలనం సృష్టించింది. 90 కోట్ల కమీషన్ వస్తుందన్న ఆశతో ఆ వ్యాపారి తన వద్ద ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు.

ఏం జరిగిందంటే?

కాంచీపురం జిల్లాకు చెందిన రవి (56) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి, కోయంబత్తూరుకు చెందిన ముత్తు మరియు అతని కుమారుడు దీపక్ (27)లతో 2019 నుండి పరిచయం ఉంది. ముత్తు 2022లో మరణించాడు.

  • మోసం పథకం: తన తండ్రికి విదేశాల నుండి ₹300 కోట్లు వచ్చాయని, ఆ డబ్బు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉందని దీపక్ రవిని నమ్మించాడు.
  • పెద్ద ఆశ: ఆ డబ్బును వెలికితీయడానికి పన్నులు కట్టాలని, ఆ విషయంలో సహాయం చేస్తే ₹300 కోట్లలో 30 శాతం అంటే ₹90 కోట్లు కమీషన్‌గా ఇస్తానని ఆశ చూపాడు. ఇందుకు సంబంధించి నకిలీ పత్రాలు, ఫోటోలను చూపించి రవిని నమ్మించాడు.
  • దోపిడీ: దీపక్ మాటలు నమ్మిన రవి విడతలవారీగా మొత్తం ₹2.5 కోట్లు ఇచ్చాడు. డబ్బు తీసుకున్న తర్వాత దీపక్ ప్లేటు ఫిరాయించాడు. తన డబ్బు తిరిగి ఇవ్వమని రవి అడిగితే, దీపక్ కుటుంబ సభ్యులు అతనిని చంపేస్తామని బెదిరించారు.
పోలీసుల చర్య:

బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు జిల్లా నేర విభాగం పోలీసులు విచారణ చేపట్టి.. దీపక్, అతని తల్లి షాలిని, సోదరి రేష్మలను అరెస్ట్ చేశారు.


Posted

in

by

Tags: