కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూ.4,780 కోట్ల కలెక్షన్లు..! సినిమా చరిత్రనే తిరగరాసిన ‘అబ్సెషన్’.. 79 రెట్ల భారీ లాభాలతో సరికొత్త రికార్డు..!!

కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.4,780 కోట్లు వసూలు చేసి హాలీవుడ్ సినీ చరిత్రలోనే ‘అబ్సెషన్’ (Obsession) చిత్రం కనీవినీ ఎరుగని రికార్డు సృష్టించింది.

అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొంది, ఊహకందని రీతిలో అసాధారణ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది.

దర్శకుడు కర్రీ బార్కర్ (Curry Barker) దర్శకత్వంలో ఇండీ నవరెట్టే (Indie Navarrette), మైఖేల్ జాన్‌స్టన్ (Michael Johnston) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గత మే 15న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

సుమారు 1 మిలియన్ డాలర్ల కంటే తక్కువ బడ్జెట్‌తో (భారత కరెన్సీలో దాదాపు రూ.60 కోట్లు) రూపొందిన ఈ చిత్రం, ఇప్పటివరకు రూ.4,780 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీని ద్వారా పెట్టిన పెట్టుబడి కంటే దాదాపు 79 రెట్లు అధిక లాభాలను ఆర్జించి పెట్టింది.

గతంలో తక్కువ ఖర్చుతో నిర్మితమై భారీ వసూళ్లు సాధించిన పలు చిత్రాల రికార్డులను ‘అబ్సెషన్’ తుడిచిపెట్టేసింది. తద్వారా లో-బడ్జెట్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

‘అబ్సెషన్’ సాధించిన ఈ అద్భుత విజయంతో దర్శకుడు కర్రీ బార్కర్‌కు హాలీవుడ్‌లో భారీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌గా ‘ఎనీథింగ్ బట్ ఘోస్ట్స్’ (Anything But Ghosts) అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *