కేవలం 370 రూపాయలకే ఒక మహిళ శరీరానికి వెల కట్టగలరా..? పీరియడ్స్ నాప్‌కిన్ల ఖర్చే దీనికంటే ఎక్కువ.! వివాదాస్పద వ్యాఖ్యలతో స్టాండ్-అప్ కమెడియన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క్లోజ్..!!

స్టాండ్-అప్ కమెడియన్ ప్రణీత్ మోర్ నిర్వహించిన ఒక షోలో.. ఒక మహిళ యొక్క శరీరాన్ని, ఆమె సమ్మతి (Consent) ని డబ్బుతో పోలుస్తూ మాట్లాడిన వీడియో ఇంటర్నెట్‌లో విడుదలై తీవ్ర వివాదానికి దారితీసింది.

ఆ షో జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల్లో ఉన్న ‘హిమాన్షు జంగ్రా’ అనే యువకుడు, తాను ఒక అమ్మాయితో కలిసి డేటింగ్‌కు వెళ్లిన కథను చెప్పాడు. అందులో, ఆ అమ్మాయికి తాను రూ. 370 విలువైన చికెన్ బిర్యానీ కొనిపించానని.. దానికి బదులుగా (ఈక్వల్‌గా) ఆ అమ్మాయి వద్దు అని నిరాకరిస్తున్నప్పటికీ, ఆమెపై బలవంతంగా శారీరక లొంగుబాటుకు ప్రయత్నించానని నవ్వుతూ వివరించాడు.

మహిళల సమ్మతిని అత్యంత దారుణంగా కించపరిచేలా ఆ యువకుడు మాట్లాడుతుంటే, అక్కడ ఉన్న కమెడియన్ ప్రణీత్ మోర్‌తో సహా ఎవ్వరూ అతనిని వారించకపోగా, నవ్వుతూ వినోదంలా చూశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి, సామాన్య ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేవలం 370 రూపాయల బిర్యానీ కొనిచ్చి ఒక మహిళ శరీరాన్ని, ఆమె ఇష్టాన్ని వెలకట్టగలరా అని.. మహిళల నెలసరి (పీరియడ్స్) నాప్‌కిన్ల ఖర్చే దీనికంటే ఎక్కువగా ఉంటుందని చాలా మంది తమ నిరసనను నమోదు చేశారు.

ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి, కండనలు రావడంతో కమెడియన్ ప్రణీత్ మోర్ ఆ వివాదాస్పద వీడియోను తన పేజీ నుండి తొలగించడమే కాకుండా.. నెగిటివ్ కామెంట్లు తట్టుకోలేక తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాను కూడా తాత్కాలికంగా ముడూ (డీయాక్టివేట్) చేసుకున్నాడు. మరోవైపు, మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఆ యువకుడు హిమాన్షు జంగ్రాను.. అతను పనిచేస్తున్న సంస్థ తక్షణమే ఉద్యోగం నుండి తొలగించింది


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *