కోట్లాది మంది భారతీయుల గుట్టు విప్పిన ఇజ్రాయెల్; భారీ ప్రకటన చేసిన నెతన్యాహు!

భారతదేశపు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు భారతీయుల గురించి ఒక కీలక ప్రకటన చేశారు. జెరూసలేంలో జరిగిన అమెరికన్ యూదు సంఘాల అధ్యక్షుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నెతన్యాహు ప్రసంగంలోని ముఖ్యాంశాలు: అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన ‘యూదు లాబీ’ ప్రతినిధులతో నెతన్యాహు మాట్లాడుతూ.. “వచ్చే వారం ఇక్కడికి ఎవరు రాబోతున్నారో మీకు తెలుసా?” అని ప్రశ్నించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన గురించి అధికారిక ప్రకటన రాకముందే నెతన్యాహు ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.

భారతదేశంలోని 150 కోట్ల మంది ప్రజలు ఇజ్రాయెల్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో నెతన్యాహు వివరించారు. ముఖ్యంగా హమాస్ దాడుల సమయంలో వందలాది మంది భారతీయులు ఇజ్రాయెల్ సైన్యం తరపున పోరాడటానికి సిద్ధమని ముందుకు రావడం వారి ప్రేమాభిమానాలకు నిదర్శనమని ఆయన అన్నారు. అదేవిధంగా, భారత్‌లో ఏ పండుగ జరిగినా ఇజ్రాయెల్ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతుందని, ఇటీవల మహాశివరాత్రికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపామని ఆయన గుర్తు చేశారు.

భారత్‌కు అత్యాధునిక ఆయుధాలు: ప్రధాని మోదీ పర్యటనకు ముందే ఇజ్రాయెల్ భారత్‌కు భారీ ఆయుధ సహాయాన్ని ప్రకటించింది. నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ భారత్‌కు ఈ క్రింది ఆయుధాలను అందించనుంది:

  • స్పైస్ 1000 (Spice 1000): గైడెడ్ బాంబులు.
  • ర్యాంపేజ్ (Rampage): గాలి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు.
  • ఐస్ బ్రేకర్ (Ice Breaker): మిస్సైల్ సిస్టమ్.
  • డ్రోన్లు, రాడార్లు మరియు అత్యాధునిక నిఘా పరికరాలు.

Posted

in

by

Tags: