ఐపీఎల్ ద్వారా సంపద: ఐపీఎల్ గ్లామర్ వైభవ్ సూర్యవంశీకి ప్రజాదరణనే కాదు, భారీ సంపదను కూడా తెచ్చిపెట్టింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ నికర ఆస్తుల విలువ రూ. 7 కోట్లకు చేరింది. అయితే, అతను ఇంకా మైనర్ కావడంతో, అతని ఆదాయంపై పన్ను ఎలా విధిస్తారు? భారత చట్టాల ప్రకారం అతను ఎంత పన్ను చెల్లించాలి? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఆదాయ మార్గాలు: ఐపీఎల్ కాంట్రాక్టులు, ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్ డీల్స్ మరియు ప్రకటనలు వైభవ్ ప్రధాన ఆదాయ వనరులు. 2026 ఐపీఎల్ కోసం రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 1.10 కోట్లకు రిటైన్ చేసుకుంది. మ్యాచ్ ఫీజులు, ప్రైజ్ మనీతో కలిపి అతని మొత్తం సంపాదన రూ. 3 కోట్లకు పైగానే ఉంది. ముంబైలో అతనికి ఒక అపార్ట్‌మెంట్ కూడా ఉంది.
మైనర్ల ఆదాయంపై ఆదాయపు పన్ను చట్టం: 18 ఏళ్ల లోపు వయసున్న వారు మైనర్లుగా పరిగణించబడతారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 64(1A) ప్రకారం, ఒక మైనర్ పొందే ఆదాయాన్ని వారి తల్లిదండ్రుల ఆదాయంతో కలిపి (Clubbing of Income) లెక్కిస్తారు. ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు.
పన్ను మినహాయింపులు మరియు నియమాలు:
- రూ. 1,500 మినహాయింపు: ఒక ఆర్థిక సంవత్సరంలో మైనర్ పొందే ఆదాయం రూ. 1,500 వరకు ఉంటే, దానిపై ఎటువంటి పన్ను ఉండదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే, నిబంధనల ప్రకారం పన్ను వర్తిస్తుంది.
- తల్లిదండ్రుల ఆదాయంతో కలపడం:
- తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులైతే, వారిద్దరిలో ఎవరి ఆదాయం ఎక్కువగా ఉంటుందో, ఆ మైనర్ ఆదాయాన్ని వారి ఆదాయంతో కలిపి లెక్కిస్తారు.
- తల్లిదండ్రులు విడిపోయి ఉంటే, మైనర్ ఎవరి సంరక్షణలో (తల్లి లేదా తండ్రి) ఉంటాడో, వారి ఆదాయంతో మైనర్ ఆదాయాన్ని కలుపుతారు.
- ఒకవేళ తల్లిదండ్రులు లేని పక్షంలో, మైనర్ పేరు మీద ప్రత్యేకంగా ‘ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్’ (ITR) దాఖలు చేయాల్సి ఉంటుంది.
