ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన ఆట వల్ల కాదు, సోషల్ మీడియాలో ఆయన చేసిన ఒక చిన్న ‘లైక్’ వల్ల. ఒక జర్మన్ మోడల్ ఫోటోకు కోహ్లీ లైక్ కొట్టారంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అసలేం జరిగిందంటే? గురువారం రాత్రి జర్మనీకి చెందిన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ‘లిజాలాజ్’ (Lizzalazz) ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక బోల్డ్ ఫోటోకు విరాట్ కోహ్లీ లైక్ చేశారంటూ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కోహ్లీ నిజంగానే లైక్ చేశారా లేక పొరపాటున ఆ బటన్ నొక్కారా? లేక ఇది ఏదైనా సాంకేతిక లోపమా (Algorithm Glitch) అనేది స్పష్టంగా తెలియదు కానీ, అప్పటికే ఈ విషయం ఇంటర్నెట్లో దావానంలా వ్యాపించింది.
నెటిజన్ల సెటైర్లు.. అనుష్క పేరుతో ట్రోలింగ్! ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల జోకులు పేలుస్తున్నారు. ముఖ్యంగా కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
- “అనుష్క ఈ విషయం తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది” అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా..
- “చీకూ భాయ్.. ఇలాంటి వాటి కోసం ఒక ప్రైవేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు కదా!” అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు.
- ఇది ‘పొరపాటున జరిగిన పొరపాటే’ కావచ్చని విరాట్ ఫ్యాన్స్ వెనకేసుకొస్తున్నారు.
గతంలో కూడా కోహ్లీ సోషల్ మీడియా యాక్టివిటీపై ఇలాంటి చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతున్న తరుణంలో, మైదానంలో పరుగుల కోసం కష్టపడుతున్న కోహ్లీ.. ఇలాంటి అనవసరపు వివాదాలతో వార్తల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై విరాట్ కోహ్లీ టీమ్ గానీ, ఆయన గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
