బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరులో వెన్నులో వణుకు పుట్టించే ఘటన వెలుగులోకి వచ్చింది. సానుభూతి పేరుతో ఓ ఉపాధ్యాయురాలిని వంచించి, ఆమె నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఓ ప్రబుద్ధుడు.. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో అత్యంత ఘోరమైన చర్యకు పాల్పడ్డాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల కళ్లెదుటే షేవింగ్ బ్లేడుతో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఈ భయానక ఉదంతం ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో పెను సంచలనం సృష్టించింది.
ఆ స్నేహం వెనుక ‘అర్షద్’ అసలు రూపం!
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 40 ఏళ్ల ఉపాధ్యాయురాలికి, కొద్ది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చెందిన అర్షద్ (37) పరిచయమయ్యాడు. తనను తానూ ‘నీరజ్ కుమార్’ అని, నీ స్కూల్ ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుని ఆమె నమ్మకాన్ని గెలుచుకున్నాడు. తరచూ ఆమెను కలవడానికి బెంగళూరుకు వస్తూ పోతూ ఉండేవాడు.
క్యాన్సర్ డ్రామా.. చివరి కోరిక పేరుతో వల!
కొన్నాళ్ల తర్వాత అర్షద్ తన అసలు ప్లాన్ అమలు చేశాడు. తనకు క్యాన్సర్ సోకిందని, ఇక కొన్ని రోజులే బతుకుతానని ఆమె ముందు కన్నీరు మున్నీరయ్యాడు. వైద్య ఖర్చులకంటూ రూ. 50,000 వసూలు చేశాడు. అంతటితో ఆగక, “నేను త్వరలోనే చనిపోతాను.. పోయేముందు నీతో గడపాలని ఉంది, ఇదే నా చివరి కోరిక” అంటూ ఆమెను వేధించాడు. ఆమె నిరాకరించడంతో, “కనీసం నీ నగ్న వీడియో అయినా పంపించు.. అది చూస్తూ చనిపోతాను” అని సానుభూతి పొంది ఆమె నుంచి వాట్సాప్‌లో నగ్న వీడియోను సంపాదించాడు.
బ్లాక్మెయిల్ పర్వం మొదలు..
వీడియో చేతికి రాగానే అర్షద్ తన బుద్ధిని బయటపెట్టాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ డబ్బు కోసం, శారీరక వాంఛ తీర్చాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. భయపడిపోయిన ఆమె కొన్నిసార్లు డబ్బు పంపినప్పటికీ, అతని వేధింపులు మితిమీరడంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులను ఆశ్రయించింది.
విమానంలో వచ్చి.. పోలీసుల వలలో చిక్కి!
పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. వారి సూచన మేరకు ఆ టీచర్ అర్షద్‌కు ఫోన్ చేసి, బెంగళూరుకు వస్తే తన కోరిక తీరుస్తానని నమ్మబలికింది. ఇంకేముంది.. కామంతో కళ్లు మూసుకుపోయిన అర్షద్, ఆంధ్రా నుండి నేరుగా విమానంలో బెంగళూరుకు వాలిపోయాడు. ఓ హోటల్లో గది తీసుకుని ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. టీచర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ హోటల్ గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు.
షాకింగ్ క్లైమాక్స్: మర్మాంగాన్ని కోసుకున్న నిందితుడు
పోలీసులను చూడగానే అర్షద్ ఒక్కసారిగా హడలిపోయాడు. తప్పించుకునే మార్గం లేక, తన వద్ద ఉన్న షేవింగ్ బ్లేడుతో తన మర్మాంగాన్ని కోసుకుని తీవ్రంగా గాయపరుచుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి పోలీసుల పహారాలో చికిత్స అందుతోంది.
సానుభూతి పేరుతో మహిళలను మోసం చేసే ఇలాంటి సైకోల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు.
