పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్.. తన ఆట కంటే వ్యక్తిగత జీవితం ద్వారానే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు.
ప్రస్తుతం ఆయన 4వ సారి పెళ్లి చేసుకోబోతున్నాడని పాకిస్థాన్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సానియా మీర్జాతో విడిపోయిన తర్వాత, 2024 ప్రారంభంలో పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ వైవాహిక జీవితం కూడా ఎంతో కాలం నిలవలేదని, ప్రస్తుతం అతడు మరో నటి ప్రేమలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి.
షోయబ్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టీవీ నటి వనీజా సత్తార్‌తో ప్రేమలో ఉన్నాడని, వీరిద్దరికీ త్వరలో వివాహం జరగనుందని వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. కరాచీకి చెందిన వనీజా సత్తార్, కరాచీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. ‘హమ్ టీవీ’లో ప్రసారమైన ‘లాడ్లీ’ అనే సీరియల్లో నటించడం ద్వారా పాకిస్థాన్ ప్రజల్లో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.
షోయబ్ మాలిక్, వనీజా సత్తార్ అక్టోబర్ 2వ తేదీనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారని పాకిస్థాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరికీ పెళ్లయిపోయిందని వదంతులు వచ్చినప్పుడు, షోయబ్ మాలిక్ వాటిని ఖండించాడు. కానీ, ఈసారి 4వ పెళ్లికి సంబంధించిన వార్తలు దావానలంలా వ్యాపిస్తున్నప్పటికీ.. షోయబ్ మాలిక్ ఎలాంటి ఖండన ఇవ్వకుండా మౌనంగా ఉండటం అభిమానుల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.
షోయబ్ మాలిక్ మొదటి వివాహం ఆయేషా సిద్ధిఖీతో జరిగింది. కానీ 8 ఏళ్ల తర్వాత ఆ బంధం ముగిసింది. ఆ తర్వాత 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 13 ఏళ్ల పాటు సాగిన వీరి వైవాహిక జీవితం 2023లో విడాకులతో ముగిసింది. సానియాతో విడిపోయిన వెంటనే 2024లో నటి సనా జావేద్‌ను 3వ వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం సనా జావేద్‌తో కూడా బంధం తెగిపోయి, వనీజా సత్తార్‌తో 4వ పెళ్లికి మాలిక్ సిద్ధమయ్యాడా? అనే ప్రశ్న ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply