2026 మొదటి ఆరు నెలల్లోనే భారత్‌లో 54.4 లక్షలకు పైగా సోషల్ మీడియా పోస్టులు, ఖాతాలపై మెటా సంస్థ చర్యలు తీసుకున్నట్లు వెల్లడైన సమాచారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
గత ఏడాది ఇదే తరహా చర్యల్లో కేవలం 70 వేల పోస్టులు మాత్రమే తొలగించగా.. ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగినట్లు మెటా పారదర్శకత నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి.
గత గణాంకాలతో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 13 వేల శాతం పెరిగిందనే అంచనా కూడా చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలేనని తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, చట్టవిరుద్ధమైనదిగా భావించే కంటెంట్‌పై ప్రభుత్వ సంస్థల నుంచి లేదా సంబంధిత అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు, నిర్దేశించిన గడువులోగా వాటిని తొలగించాల్సి ఉంటుంది.
గతంలో 36 గంటల వరకు ఉన్న గడువును.. ఇప్పుడు కేవలం మూడు గంటలకు తగ్గించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
దీంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టుల తొలగింపు చర్యలు వేగంగా పెరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ చర్యల వల్ల ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వ విధానాలను విమర్శించే వ్యక్తుల పోస్టులు కూడా ప్రభావితమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వాన్ని విమర్శించే ఖాతాలపై కూడా చర్యలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు రాజకీయంగా కొత్త వివాదానికి తెరలేపాయి.
దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సెన్సార్షిప్, ప్రభుత్వ పర్యవేక్షణ, సోషల్ మీడియా నియంత్రణ, భావప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చ మరింత వేడెక్కుతోంది.
సోషల్ మీడియాలో ఏది ఉండాలి? ఏది తొలగించాలి? అనే నిర్ణయాలు ఎవరి చేతుల్లో ఉండాలి?
ప్రజల భద్రత పేరుతో కంటెంట్‌ను నియంత్రించడం అవసరమేనా? లేక అది ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పుగా మారుతోందా?
ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి.

Leave a Reply