గల్ఫ్ దేశాలకు శాపంగా మారిన అమెరికా రక్షణ; రష్యా మద్దతుతో విరుచుకుపడుతున్న ఇరాన్!

గల్ఫ్ దేశాలు తమ భూభాగంలో అమెరికాకు సైనిక స్థావరాలను అనుమతించి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ దేశాల భద్రతను తాము చూసుకుంటామని హామీ ఇస్తూ అమెరికా ఇక్కడ విస్తృతంగా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. అయితే, ఇప్పుడు అదే అమెరికా రక్షణ ఈ దేశాల ఉనికికే ముప్పుగా పరిణమించింది.

అమెరికా వైఫల్యం మరియు ఇరాన్ దూకుడు: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లు విరుచుకుపడుతుంటే గల్ఫ్ దేశాల నుండి ఒకే ప్రశ్న వినిపిస్తోంది—”సొంత స్థావరాలనే కాపాడుకోలేని వారు మమ్మల్ని ఎలా రక్షిస్తారు?”. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అమెరికా తడబడుతోంది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. పవిత్ర రంజాన్ మాసంలో ఇరాన్ పై అమెరికా దాడులు చేయడాన్ని అరబ్ దేశాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే అమెరికా స్థావరాలపై దాడులు జరుగుతుంటే అక్కడి సామాన్య ప్రజలు హర్షిస్తున్నారు.

రష్యా మద్దతు – యుద్ధ గతిని మార్చే అంశం: అమెరికా లక్ష్యాలపై ఇరాన్ ఇంత ఖచ్చితంగా దాడులు చేయగలుగుతుందంటే దానికి కారణం రష్యా అని ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. రష్యా ఇంటెలిజెన్స్ సమాచారం మరియు సాంకేతికతను ఇరాన్ విరివిగా వాడుకుంటోంది. ఉక్రెయిన్ కు అమెరికా సహాయం చేస్తున్నందుకు ప్రతికారంగా రష్యా ఇప్పుడు ఇరాన్ కు అండగా నిలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య జరిగిన చర్చలు అమెరికా, ఇజ్రాయెల్ లలో వణుకు పుట్టిస్తున్నాయి.

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల పరిస్థితి: బహ్రెయిన్, ఖతార్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా మరియు ఒమన్ లలో అమెరికాకు కీలకమైన వైమానిక మరియు నౌకాదళ స్థావరాలు ఉన్నాయి.

  • బహ్రెయిన్: ఇక్కడ ఉన్న అమెరికా 5వ నౌకాదళం (5th Fleet) పై ఇరాన్ ఇప్పటికే పలుమార్లు దాడులు చేసింది.
  • ఖతార్ (అల్ ఉదైద్): ఇది ఈ ప్రాంతంలోనే అతిపెద్ద అమెరికా వైమానిక స్థావరం. ఇక్కడి రాడార్ వ్యవస్థలు ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి.
  • కువైట్: ఇక్కడి అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో కొందరు సైనికులు మరణించినట్లు సమాచారం.
  • యూఏఈ (అల్ దఫ్రా & జెబెల్ అలీ): ఇక్కడి ఇంధన నిల్వలు, నౌకాశ్రయాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది.


Posted

in

by

Tags: