నేటి మారుతున్న జీవనశైలి కారణంగా కొత్త వ్యాధులు మన శరీరాన్ని చుట్టుముడుతున్నాయి. పూర్వం మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేది, కానీ నేడు అవే పదార్థాలు గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తున్నాయి. శరీరానికి అత్యంత హాని కలిగించే ఆ తెల్లటి పదార్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
మనం మాట్లాడుకుంటున్న ఆ పదార్థం మరేదో కాదు.. ప్రతి వంటింట్లో ఉండే చక్కెర (Sugar). వైద్యుల అభిప్రాయం ప్రకారం, చక్కెర శరీరంలో సులభంగా కరిగి ఇన్సులిన్ నిరోధకతను (Insulin Resistance) పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బులు మరియు ఫ్యాటీ లివర్ ముప్పు భారీగా పెరుగుతుంది. చాలామంది తెల్ల చక్కెరను నేరుగా తినరు, కానీ ‘ఆరోగ్యకరం’ అనుకుని చక్కెర అధికంగా ఉండే ఇతర పదార్థాలను తింటుంటారు.
చక్కెర దాగి ఉండే ప్రమాదకరమైన పదార్థాలు:
- టమోటా సాస్: చాలామంది పరోటా లేదా ఇతర చిరుతిళ్లతో సాస్ తింటారు. ‘నో యాడెడ్ షుగర్’ (No Added Sugar) అని ప్రచారం చేసినప్పటికీ, దాదాపు అన్ని సాస్‌లలో చక్కెర ఉంటుంది. ఒక స్పూన్ సాస్ తింటే, ఒక స్పూన్ చక్కెర తిన్నట్టే.
- కూల్ డ్రింక్స్ మరియు పండ్ల రసాలు: సాఫ్ట్ డ్రింక్స్ మరియు ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్‌లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. పండ్లు నేరుగా తింటే పోషకాలు అందుతాయి, కానీ జ్యూస్‌గా మార్చినప్పుడు అవి ఆరోగ్యకరం కావు. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచి గుండెపై ప్రభావం చూపుతాయి.
- ఫ్లేవర్డ్ పెరుగు (Flavoured Yogurt): ఇంట్లో తయారుచేసిన పెరుగు ఆరోగ్యానికి మంచిది. కానీ మార్కెట్లో దొరికే రంగులు, రుచులు కలిపిన పెరుగులో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
