“గుండె మండిపోదూ దేవుడా..!” జ్యూస్ తాగినట్లు లీటరు ఆవనూనె తాగేసిన వ్యక్తి.. గుటగుటా మింగేసిన విపరీత చేష్ట.. షాక్‌లో నెటిజన్లు.. వీడియో వైరల్!!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సీసాలో ఉన్న పసుపు రంగు వంటనూనెను నోట్లో పోసుకుని గుటగుటా తాగేస్తున్న దృశ్యం నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ వీడియో ఎక్కడ, ఎవరు తీశారనే పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా తెలియరాలేదు.

వీడియోలో ఉన్న ఆ వ్యక్తి ఎడ్లబండి పక్కన నిలబడి, సుమారు ఒక లీటరు ఆవనూనెను (Mustard Oil) ముఖంపై, బట్టలపై కారుతున్నా పట్టించుకోకుండా గటగటా తాగేస్తున్నాడు. సాధారణ వ్యక్తులు కొద్దిపాటి నూనెను కూడా అలా నేరుగా తాగలేని పరిస్థితుల్లో, ఇతను లీటరు నూనెను జ్యూస్ తాగినట్లు తాగడం ఇంటర్నెట్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

“మేము 250 మి.లీ కూల్‌డ్రింక్ తాగడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం, కానీ ఇతనేంటి లీటరు నూనెను షర్బత్ తాగినట్లు తాగేస్తున్నాడు” అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. “లీటరు నూనెను నేరుగా తాగడం అంత తేలికైన విషయం కాదు, ఇది చూస్తుంటే ఆశ్చర్యం కంటే భయమే ఎక్కువగా కలుగుతోంది” అంటూ మరికొందరు తమ ఆందోళనను వ్యక్తపరుస్తున్నారు.

వంటనూనె అనేది ఆహారంలో ఉపయోగించే పదార్థమే కాబట్టి అది విషపూరితం కాకపోవచ్చు. కానీ, ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నూనెను తాగినప్పుడు అది గొంతులో చిక్కుకుని, కడుపులోకి వెళ్లకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలా నూనె ఊపిరితిత్తుల్లోకి చేరితే న్యుమోనియా (Lipoid pneumonia), తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.

అంతేకాకుండా, కల్తీ ఆవనూనెను నేరుగా తాగడం వల్ల శరీరంలో వాపులు, తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఈ వీడియోలోని వ్యక్తి ఎవరు? ఆ తర్వాత అతని ఆరోగ్యం ఎలా ఉంది? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *